Begin typing your search above and press return to search.
భారత్ కు అండగా హాలీవుడ్.. తారల విరాళం!
By: Tupaki Desk | 4 May 2021 2:30 AM GMTకరోనా సెకండ్ వేవ్ విజృంభణతో.. దేశం అత్యంత దారుణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో.. భారత్ కు పలు దేశాలు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తమకు తోచిన విధంగా సహాయం అందిస్తున్నాయి. ఇప్పుడు హాలీవుడ్ తారలు కూడా మేము సైతం అంటున్నారు. భారత్ కష్టం తీర్చేందుకు తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు.
హాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన స్మిత్.. తన కుటుంబం తరపున 50,000 డాలర్లను కొవిడ్ రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆయనతోపాటు.. కెనడియన్ టాప్ సింగ్ షాన్ మెండిస్ తోపాటు ప్రఖ్యాత రచయిత బ్రెండన్ బుర్చార్డ్ కూడా తన వంతు సహాయం ప్రకటించారు. 50 వేల డాలర్లను అందిస్తున్నట్టు తెలిపారు. వీరితోపాటు ఐటీ కాస్మిటిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ కెర్న్ లిమా లక్ష డాలర్ల సహయాన్ని ప్రకటించారు.
ప్రపంచంలోనే ప్రఖ్యాత షోలలో ఒకటైన 'ద ఎల్లెన్' తరపున 59,000 డాలర్లను సేకరించి భారత్ కు అందించినట్టు సమాచారం. వీరితోపాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా 15,000 డాలర్ల విరాళం ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇంకా.. క్యూబా-అమెరికన్ సింగర్ కమ్ రైటర్ కామిలా కాబెల్లో కూడా తన వంతుగా 6,000 డాలర్లు అందించినట్టు తెలిసింది.
భారత్ కష్టాలు తీర్చేందుకు ప్రపంచం మొత్తం ముందుకు వస్తోంది. అయితే.. భారతీయ సినీ ప్రముఖులు మాత్రం పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. కష్టకాలంలో ఉన్న తోటి భారతీయులను ఆదుకునేందుకు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.