Begin typing your search above and press return to search.
వైరస్ నుంచి కోలుకున్న హోంమంత్రి తిరిగి విధుల్లోకి..
By: Tupaki Desk | 14 July 2020 9:45 AM GMTవైరస్ బారిన తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పడుతున్నారు. ఇప్పటికే ఒక డిప్యూటీ స్పీకర్.. ముగ్గురు ఎమ్మెల్యేలు వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఇక వారితో పాటు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కూడా వైరస్ బారిన పడుతున్నారు. వైరస్ బారిన పడిన ఆయన ఇంట్లోనే చికిత్స పొంది కోలుకున్నారు. కోలుకున్న తర్వాత ఆయన తిరిగి విధులకు చేరారు. సోమవారం నుంచి విధులకు హాజరవుతున్నారు. రాష్ట్రంలో విజృంభిస్తున్న వైరస్ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా హోంమంత్రి అధికారులకు సూచించారు. వైరస్ మహమ్మారి పట్ల ప్రజలెవరూ భయాందోళనలకు గురికాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
ఆ వైరస్ కు ఇంకా వ్యాక్సిన్ ఇంకా రాలేదని గుర్తుచేస్తూనే అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి మహమూద్ అలీ ఓ ప్రకటనలో తెలిపారు. విధుల్లో భాగంగా ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు, పలువురు ఐపీఎస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, రోజూ అరగంట వ్యాయామం చేస్తూ బలవర్ధక ఆహారం తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
హోంమంత్రి మహమూద్ అలీకి వైరస్ సోకిన విషయం తెలిసిందే. మంత్రితో పాటు అతడి కుమారుడు, మనవడు కరోనా బారినపడ్డారు.