Begin typing your search above and press return to search.
తిరుగుబాటు ఎంపీకి హోంశాఖ షాకిచ్చిందా ?
By: Tupaki Desk | 29 Jun 2022 4:32 AM GMTఢిల్లీలో ఆయన గోలచూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంది. జూలై 4వ తేదీన నరసాపురం నియోజకవర్గంలో పర్యటించబోతున్న నరేంద్రమోడితో తాను కూడా ఉండాలని వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు అనుకుంటున్నారు.
అయితే పర్యటనలో పర్యటించటం ఆయనచేతిలో లేదుకదా. ఇందుకు పరిస్ధితులు కూడా సహకరించాలి. తాను నియోజకవర్గంలో అడుగుపెడితే అరెస్టు చేయటానికి పోలీసులు కుట్ర పన్నుతున్నట్లు కొద్దిరోజులుగా నానా గోలచేస్తున్నారు.
తన పర్యటనకు కేంద్ర దళాలతో భద్రత కల్పించాలని, అరెస్టుచేయకుండా ఏపీ పోలీసులకు ఆదేశించాలని హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తో పాటు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలిశారు. అయితే ఎంపీ వినతిని వాళ్ళిద్దరు పట్టించుకున్నట్లు లేదు. అందుకనే తన విషయంలో ఎవరైనా పిచ్చివేషాలు వేస్తే రక్షణకోసం ప్రధానమంత్రిని అభ్యర్ధించాల్సుంటుందని భయంతో కూడిన హెచ్చరిక చేయటమే విచిత్రంగా ఉంది.
పైగా ఇంతకు మించిన విచిత్రంఏమిటంటే ప్రభుత్వం, పోలీసుల నుండి తనకున్న హానిని గుర్తించి ప్రతిపక్షాలు, అల్లూరి సీతారామరాజు స్పూర్తితో పనిచేసే తమ పార్టీలో పనిచేసే వారే రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేశారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మోడి వస్తున్నారు. కాబట్టి అల్లూరి స్పూర్తిగురించి ఎంపీ ప్రస్తావించారు. మరి ఏ స్పూర్తితో ఎంపీ ఎక్కడో ఢిల్లీలో కూర్చుని జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారో తెలీటంలేదు.
విగ్రహావిష్కరణకు ఆహ్వానించటానికి వచ్చిన వారితో కూడా ఒకరిద్దరిని జగన్ పక్కకు పిలిచి కార్యక్రమానికి తనను రాకుండా చూడమని చెప్పినట్లు తనకు తెలిసిందని చెప్పటమే పెద్ద జోక్. ఎందుకంటే కార్యక్రమానికి జగన్ ఎలాగూ ఉండటంలేదు.
తాను ఉండని కార్యక్రమానికి ఎంపి హాజరైతే ఏమిటి హాజరుకాకపోతే ఏమిటి. అరెస్టు విషయంలో భయపడుతు, తాను నియోజకవర్గంలోకి అడుగుపెడితే ఏదో చేసేస్తారని టెన్షన్ పడుతున్న ఎంపీ అసలు కార్యక్రమానికి రాకపోతే ఏమవుతుంది ? పైగా తనను అరెస్టుచేస్తే తీవ్ర పరిణామాలంటు వార్నింగులొకటి.