Begin typing your search above and press return to search.

ఏపీలో ఇంటింటికి టీకా.. పంపిణీ కార్యక్రమం

By:  Tupaki Desk   |   24 Sep 2021 6:31 AM GMT
ఏపీలో ఇంటింటికి టీకా.. పంపిణీ కార్యక్రమం
X
కరోనాను తరిమికొట్టేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. మూడో వేవ్ రాకముందే అప్రమత్తం కావడానికి అన్ని ఏర్పాట్లుచేస్తోంది. ఈ క్రమంలోనే ఇంటింటికీ టీకాను అందించేందుకు రంగం సిద్దం చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి, రెండవ మోతాదుతో కలిపి దాదాపు 3.84 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను వేశారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2.18 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.63 శాతంగా ఉంది. ఇంకా రాష్ట్రం సగటున వెయ్యి కేసులు నమోదవుతోంది.

ఈ పరిస్థితుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ రోజువారీగా చాలామందికి టీకాలు వేయాలని.. టీకా శాతాన్ని పెంచాలని ఆరోగ్యశాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాలను ఆరోగ్య శాఖ అమలు చేస్తోంది. దీంతో వారు టీకాలపై ఇంటింటికీ తిరిగి వేయడాన్ని ప్రారంభించారు.

ఆరోగ్య కార్యకర్తలు చేతుల్లో వ్యాక్సిన్ బాక్సులతో ఇప్పుడు గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లోకి వచ్చారు. ఈ మేరకు వీడియోలు వైరల్ అవుతున్నాయి. 'కరోనా వ్యాక్సిన్ ... మీరు మీ టీకాను స్వీకరించారా?' అడుగుతున్న వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. వేడి ఎండ ఆరోగ్య కార్యకర్తలు విధుల్లో తిరుగుతూ వ్యాక్సిన్లు వేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రతి ఇంటింటికి చేరుకుని ప్రజలను టీకాలు తీసుకున్నారా? అని అడుగుతూ వేసుకోనివారికి ఉచితంగా వేస్తున్నారు. అయితే ప్రజల భాగస్వామ్యం కూడా ఇక్కడ తప్పనిసరి. వారు టీకా తీసుకోవడానికి ముందుకు రావాలని ప్రభుత్వం కోరుతోంది.

ఇంతకు ముందు ఆశా వర్కర్లు కరోనా మహమ్మారి విజృంభణ సమయంలోనూ రాష్ట్రానికి వెన్నెముకగా నిలబడ్డారు. ప్రాణాలకు తెగించి వ్యాక్సిన్లు వేస్తూ.. రోగులకు సేవలు చేస్తూ ప్రశంసలు అందుకున్నారు. ఆశా -ఆరోగ్య కార్యకర్తల ఈ ప్రయత్నాలు భారీ ప్రశంసలకు అర్హమైనవి.