Begin typing your search above and press return to search.
ల్యాప్ టాప్ లను చూసి వణుకుతున్న అమెరికా
By: Tupaki Desk | 17 May 2017 7:53 AM GMTఅగ్రరాజ్యం అమెరికా సాధారణ ల్యాప్ టాప్ లను చూసి భయపడిపోతోంది. తాజాగా వైరస్ అటాక్ ల నేపథ్యంలో యూరప్ నుంచి అమెరికాకు విమానంలో వచ్చే ప్రయాణికులు ల్యాప్‌టాప్‌లు తీసుకురావద్దని నిషేధం విధించింది. యూరప్ నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికుల వద్ద ల్యాప్ టాప్స్ - ట్యాబ్లెట్ లాంటి గాడ్జెట్లు తెస్తున్నారా అనే కోణంలో విమానాశ్రయాల్లో తనిఖీలు చేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సూచించింది.
కాగా ఇంతకుముందు కూడా అమెరికా ఇలా ల్యాప్ టాప్ లపై నిషేధం విధించింది. గత మార్చిలో ఎనిమిది దేశాలకు చెందిన 10 ఎయిర్ పోర్టుల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద ల్యాప్ టాప్స్ ఉండొద్దంటూ అమెరికా నిషేధించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పడు దాన్ని మొత్తం యూరప్ కు వర్తిస్తోంది. అంతేకాదు... యూరోపియన్ ఎయిర్‌లైన్స్‌తో పాటు పలు దేశాల ఎయిర్‌లైన్స్‌ను ఆమెరికాకు రాకుండా త్వరలో నిషేధించే దిశగా ఆమెరికా అడుగులు వేస్తుంది. యూరప్‌లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న ర్యాన్సమ్ వేర్ వాన్నా క్రై భారిన అమెరికా పడకుండా ఉండాలంటే ఈ చర్యలు తప్పవని భావిస్తోంది.
సమ్మర్లో ఈయూ నుంచి ప్రతివారం 3250కి పైగా విమానాలు అమెరికాకు వస్తుంటాయి... ఆ సమయంలో వైరస్ భారినపడ్డ వారి డివైజ్‌లు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్ వంటి వాటివల్ల తమ దేశంలోనూ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని భయపడుతోంది. సైబర్ దాడి వల్ల బ్యాటరీలు పేలిపోయే అవకాశం ఉందని, ఈ క్రమంలో ఉగ్రదాడులు జరగొచ్చునని కూడా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టెన్షన్ పడుతున్నారట. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను సాధనాలుగా వాడుకుని సైబర్ దాడితో పాటు పక్కా ప్రణాళికలతో ఉగ్రదాడులకు పాల్పడే సూచనలున్నాయని అమెరికా నిఘా విభాగాలు అంటున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/