Begin typing your search above and press return to search.

కరోనా కి హోమియో టీకా .. భారత్ కీలక ముందడుగు

By:  Tupaki Desk   |   16 April 2021 5:05 AM GMT
కరోనా కి హోమియో టీకా .. భారత్ కీలక ముందడుగు
X
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కరోనాను నియంత్రించేందుకు అల్లోపతి వ్యాక్సినేషన్లు వినియోగానికి వచ్చిన ఈ సమయంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్ మరో కీలక ముందడుగు వేసింది. హోమియోపతి వ్యాక్సిన్‌ తో కరోనాను తరిమేందుకు ప్రణాళికలు రచించింది. ప్రపంచంలో ఏ దేశం కూడా కరోనా కట్టడికి హోమియో వ్యాక్సిన్ వాడలేదు. భారత్ మాత్రం హోమియో టీకా ఇచ్చేందుకు సిద్దమవుతుంది. దేశంలో ఇప్పటివరకు రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మద్యే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు కూడా ఇండియా అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా అంతం కోసం హోమియో టీకా ఇచ్చేందుకు సిద్దమవుతుంది. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయి. కాగా ఈ వ్యాక్సిన్ ని లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిలా కంపెనీ తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ 62 శాతం ప్రభావం చూపుతుందని ఆ సంస్థ అధిపతి డాక్టర్ రాజేష్ తెలిపారు. వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో తాము తయారు చేసిన సోనోడ్ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మనిషిలో సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతూ, వ్యాధిలక్షలను తగ్గించేది టీకా అని, సోనోడ్ కూడా టీకానే అని అంటున్నారు తయారీదారులు. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని హోమియో నిపుణులు చెప్తున్నారు. ఈ టీకా సక్సెస్ అయ్యి , అందుబాటులోకి వస్తే మరింత మందికి వ్యాక్సిన్ త్వరగా ఇచ్చే అవకాశం ఉంటుంది.