Begin typing your search above and press return to search.
త్వరపడండి.. తక్కువ రేటుకే అమేజాన్ లో ఇళ్లు..
By: Tupaki Desk | 22 Oct 2019 6:56 AM GMTఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు.. ఏ వ్యక్తి జీవితంలోనైనా ఇవి పెద్ద టాస్క్ లు. వీటి రెండింటి అప్పుడు జీవితకాలంలో తీర్చలేక తనువు చాలించిన వారు ఎందరో.. ముఖ్యంగా సొంతుళ్లు కట్టుకున్న వారిని సమాజంలో ఎంతో గౌరవంతో చూస్తారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోవడం అంత ఈజీకాదు.. గ్రామాల్లో - పట్టణాల్లో - ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో లక్షలు ఖర్చు అవుతున్న పరిస్థితి. చిన్న ఇళ్లు అయినప్పటికీ విశాలమైనవి - పైకప్పు పీవోపీలు - లైట్లు - గోడలు - అంతస్థులు ఇలా డోర్స్ సహా ఫర్నిచర్ - టైల్స్ - మార్బుల్స్ అన్నీ ఇంటి నిర్మాణాన్ని భారీగా ఖరీదైన వ్యవహారంగా మార్చేశాయి. ఇల్లు కట్టాలంటేనే దడ పుట్టే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అందుకే ఇప్పుడే ప్రపంచ ఈకామర్స్ దిగ్గజం ‘అమేజాన్’ పేదలు - ఉద్యోగుల సొంతింటి కలను నెరవేర్చడానికి సిద్ధమైంది.
ఇందులో భాగంగా కంటెనైర్ ఇళ్లను అందుబాటులోకి తెస్తోంది. పూర్తిగా ఇనుము ఉక్కుతో తయారు చేసిన ఈ ఇళ్లు అగ్ని - ప్రకృతి బీభత్సాల నుంచి పూర్తి రక్షణ కల్పిస్తాయి. లోపల - వెలుపల ఇంటీరియర్ డిజైన్ తో తీర్చిదిద్దారు. ఈ ఇనుము ఉక్కు తుప్పు పట్టకుండా తయారు చేశారు. కంటైనర్లను ఇళ్లుగా మార్చి రెండంతస్తుల్లో సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఇందులోనే బాత్రూం - కిచెన్ - లివింగ్ - డైనింగ్ ఏరియా - రెండు బెడ్ రూములు.. డిమాండ్ మేరకు కొంతమందికి ఆటస్థలం కూడా ఉంది. అందమైన అలమారాలు - డెకరేషన్ తో తీర్చిదిద్దారు. కస్టమర్లు పూర్తి సంతృప్తికరంగా ఓకే చెప్పేలా హస్తకళ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
ఈ అందమైన కంటెనైర్ తరహా ఇళ్ల ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దీని విలువ కేవలం 14999 డాలర్లు మాత్రమే. మన ఇండియన్ రూపాయల్లో అక్షరాల 10,62,881 రూపాయలు. ఇక వీటికి అదనంగా షిప్పింగ్ చార్జీలు 3వేల డాలర్లు వసూలు చేస్తారు. ఈ ప్రింట్ సైజ్ ఇళ్లు ఖచ్చితంగా వినియోగదారులకు రెడీమేడ్ పోర్టబుల్ ఇళ్లుగా ఉపయోగపడుతాయి. వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లి పెట్టుకునే విధంగా తయారు చేశారు