Begin typing your search above and press return to search.
మంత్రి.. ఎంపీ.. ఎమ్మెల్యేల ఇళ్లు తగలేశారు
By: Tupaki Desk | 2 Sep 2015 4:27 AM GMTమణిపూర్ లో చెలరేగుతున్న ఆందోళనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మణిపూర్ అసెంబ్లీలో ఆమోదించిన మూడు బిల్లుల ఆమోదంతో మణిపూర్ గిరిజనులలో విపరీతమైన ఆందోళన నెలకొంది. తమ భూములను బయట వ్యక్తులకు హక్కులు లభించే అవకాశం ఉండే ఈ బిల్లు ఆమోదం పొంది.. చట్టరూపంలోకి రానుండటం ఆందోళనకు ప్రధాన కారణం.
ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్న మణిపూర్ వాసులు ఆందోళన మొదలు పెట్టారు. ఈ ఆందోళనలు హద్దు మీరి హింసాత్మక చర్యలకు పురి కొల్పింది. అది కూడా ఏ స్థాయిలో ఉంటే.. ఆ రాష్ట్ర మంత్రి.. ఎంపీతో సహా ఏడుగురి నివాసాలకు నిప్పు పెట్టేశారు.
రోజురోజుకి పెరుగుతున్న ఉద్రిక్తతతో హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో గడిచిన వారంలో ఎనిమిది మంది వరకు మరణించారు. ప్రస్తుతం మణిపూర్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు పారా మిలటరీ బలగాల్ని మణిపూర్ కు పంపుతున్నారు.