Begin typing your search above and press return to search.
అదిరిపోయిన హోండా సరికొత్త బైక్.. ధర చూస్తే మతిపోవాల్సిందే!
By: Tupaki Desk | 30 March 2021 8:30 AM GMTబైక్ అంటే యువతకు అదోరకమైన మోజు. ఖరీదైన కార్లు ఉన్నా కూడా బైక్ లపై మనసుపారేసుకుంటారు. ఇక రేసు బైకులంటే రైడర్లకు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బైక్ ని రేసు పెంచుతూ సర్రున నడుపుతుంటే ఆ ఆనందమే వేరంటారు రైడర్లు. అందుకే ఖరీదు ఎంతైనా సరే కొందరు అలాంటి బైకులు కొంటారు. వాటిని తీసేది చాలా తక్కువ అయినా సరే ఉంటి ముందు ఉండాల్సిందేననుకుంటారు. ఇక ఇలాంటి అభిమానులను టార్గెట్ చేసుకొనే వివిధ ద్విచక్రవాహనాల సంస్థలు నయా మోడల్స్ సృష్టిస్తున్నాయి. దిగ్గజ సంస్థ హోండా మరో కొత్త రకం బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఈ బైక్ ధర హాట్ టాపిక్ గా మారింది. కారు కంటే అధిక ధర పలుకుతోంది. అయినా దేని ప్రత్యేకత దానిదే కదా. అందుకే హోండా ఈ సరికొత్త బైక్ ను తయారుచేసింది.
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హోండా ఇటీవల హోండా CB500X అడ్వెంచర్ బైక్ ను రూపొందించింది. దీని ధర రూ.6.78లక్షలుగా ప్రకటించింది. చూడడానికి ఈ బైక్ చాలా ఆకర్షణియంగా ఉంది. మిడిల్ వెయిట్ తో ఉన్న ఈ బైక్ ను తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది. దీనికి ఉన్న లైట్లన్నీ ఎల్ఈడీవేనని ఆ సంస్థ తెలిపింది. ఇక నెగెటివ్ డిస్ ప్లే ఎల్ సీడీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ను కలిగిఉందని పేర్కొంది. బైక్ సీటు, విండ్ డిఫ్లెక్టర్ వంటివి సౌకర్యవంతంగా ఉంటాయని చెబుతోంది. వీటిని ఎత్తు కావాలంటే పెంచుతూ, తగ్గించుకునే వీలుంటుందని ప్రకటించింది.
ఫ్రంట్, రియర్ సస్పెన్షన్ లూ అడ్జస్ట్ చేసుకోవచ్చని హోండా వెల్లడించింది. మిగతా హోండా బైక్ లకన్నా ఇంజిన్ లో కాస్త తేడా ఉంటదని వివరించింది. ఇది 471సీసీ పార్లర్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుందని పేర్కొంది. 43.3ఎన్ఎం టార్క, 47 హెచ్పీ హార్స్ పవర్ ఇస్తుందని తెలిపింది. ఈ బైక్ ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తయారు చేశామని.. అందుకు చాలా కష్టపడినట్లు ఆ సంస్థ వివరించింది. ఎలాంటి రోడ్లపై అయినా దూసుకుపోవచ్చునని పేర్కొంది. రోడ్ ఫ్రెండ్లీగా ఉంటుందని వెల్లడించింది. 310 ఎమ్ఎమ్ డిస్క్ ఉపయోగకరంగా ఉంటుందని, ఈ మోడల్ కు మంచి రివ్యూలు వచ్చాయని ప్రకటించింది.
హోండా ఇటీవల మార్కెట్ లోకి విడుదల చేసిన CB500X సరికొత్త బైక్ లుక్ అదిరిపోయిందని రైడర్లు చెబుతున్నారు. ఈ బైక్ నూ చూడగానే రయ్యిన డ్రైవ్ చేయాలనుకుంటారని అన్నారు. డ్రైవర్, రోడ్ ఫ్రెండ్లీగా ఉంటుందని రైడర్లు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఎత్తు తక్కువ ఉన్నవారూ దీనిని డ్రైవ్ చేయచ్చని వారు అంటున్నారు. రోజంతా నడిపినా సౌకర్యవంతంగా ఉందని తెలిపారు. చూడడానికి స్టైలిష్ గా ఉన్న ఈ బైక్ ఆరో గేర్లో నడుపతూ దూసుకుపోవచ్చని... ఈ అడ్వెంచర్ బైక్ చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు. ఈ కాస్ట్ లీ బాక్ సర్రున రోడ్డు మీద తిప్పుతుంటే వచ్చే ఆ మజానే వేరుంటుందని అంటున్నారు.