Begin typing your search above and press return to search.
జగన్ ... జడిసే రకం కాదు!
By: Tupaki Desk | 7 Jun 2018 4:30 PM GMTజగన్ మొండి ఘటం... అవును. అనుకున్నది చేసే మొండిఘటమే. ఏమైనా కానీ ఏదైనా జరగనీ అనుకునే రకం. కాబట్టే... అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో హెచ్చరికలకు కష్టాలకు లొంగకుండా ముందుకు సాగాడు. అధికార పక్షమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతికి దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నా, చేతిలో అధికారం ఉన్నా, కేంద్రం అండ ఇంతకాలం ఆయన వైపున్నా... టెక్నాలజీలో పేరుగాంచినా.... జగన్ ఒక్కో మెట్టు ఎక్కుతో చివరకు జనాల గుండె గూటికి చేరారు.
జగన్ గురించి తాజాగా జరిగిన ఒక చిన్న ఉదాహరణ కచ్చితంగా ప్రస్తావించాలి. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్ నిడదవోలు నియోజకవర్గంలోని నడిపల్లికోటకు చేరింది. ఆ సందర్భంగా ఎవరో ఆకతాయిలు జగన్ పాదయాత్ర సమీపిస్తుండగా తేనె తుట్టెపై రాయి వేశారు. అంతే ఒక్కసారిగా జనం ఉరుకులు పరుగులు పెట్టారు. కానీ జగన్ మాత్రం ఎటూ వెళ్లకుండా చేతిని మొహానికి అడ్డంపెట్టుకుని స్వీయరక్షణలో ఉండగా... వెంటనే భద్రతా సిబ్బంది ఆయనపై టవల్స్ కప్పి చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. కానీ తేనెటీగలు అంత త్వరగా తోక ముడిచే రకం కాదు. అయినా ఐదు నిమిషాల్లోనే తేరుకున్న జగన్ అక్కడి నుంచి మళ్లీ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగించారు. అప్పటికీ ఇంకా ఈగలు అక్కడక్కడా ముసురుతూనే ఉన్నా వాటిని జగన్ పట్టించుకోలేదు. దీంతో భద్రతా సిబ్బంది, కొందరు కార్యకర్తలు ఆయన చుట్టూ తేనెటీగలను కర్చీఫ్స్, టవల్స్‌తో విసురుతూ ముందుకు సాగారు. ఈ సంఘటన చూసిన పలువురు భలే మనిషండీ ఈయన ఇంత కూడా వెరవరు అంటూ అనుకోవడం విశేషం.
నిజానికి సంకల్పయాత్రకు ముందే రాష్ట్రంలో జగన్ వేవ్ మొదలైంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత దీనికి ఒక కారణం కాగా, ప్రత్యేక హోదా పట్ల జగన్ గట్టిగా నిలబడటం ఆయనపై జనాలకు విపరీతమైన నమ్మకాన్ని కల్గించింది. ఇలాంటి మడమ తిప్పని వ్యక్తికి అధికారం ఇచ్చి చూద్దాం ఒకసారి అంటూ మొదలైన ఆలోచన.... ఈరోజు రాష్ట్రమంతటా వైసీపీకి సానుకూలంగా మారేలా మార్చేశారు జగన్.
ఒకవైపు ఎర్రటి ఎండ - పైగా కోస్తా తీర ప్రాంతం. పక్క వీధిలోకి వెళ్లొస్తే చెమటలతో చొక్కా తడిసిపోయే పరిస్థితుల్లో జగన్ అప్రతిహతంగా కొనసాగించారు. ఉక్కపోతకు తట్టుకోలేక హైదరాబాదులో స్థిరపడిన కృష్ణా-గుంటూరు వాసులు మే నెలలో ఊరికి కూడా వెళ్లరు. అలాంటిది సరిగ్గా అదేనెలలో జగన్ ఆ జిల్లాల్లో యాత్ర కొనసాగించారు. అతని పట్టుదలకు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. అనుభవం ఎన్నేళ్లన్నది కాదన్నయ్యా... పట్టుదల ఎంత గొప్పదన్నదే విజయరహస్యం అని జగన్ ని చూస్తే అనిపించకమానదు.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి