Begin typing your search above and press return to search.

పోలీసుల‌కు చుక్క‌లు చూపిస్తోన్న హ‌నీ

By:  Tupaki Desk   |   8 Oct 2017 5:28 AM GMT
పోలీసుల‌కు చుక్క‌లు చూపిస్తోన్న హ‌నీ
X
గుర్మీత్ బాబా అలియాస్ డేరా బాబా ద‌త్త‌పుత్రిక‌గా ప్ర‌చారం చేసుకునే హ‌నీప్రీత్ వ్య‌వ‌హారం పోలీసుల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. కోర్టు ఆదేశాల‌తో ఆమెను విచారిస్తున్న పోలీసుల‌కు.. హ‌నీ చెబుతున్న స‌మాధానాల‌తో ఏం చేయాలో తోచ‌ని ప‌రిస్థితినెల‌కొంద‌ని చెబుతున్నారు. పోలీసులు ఏ ప్ర‌శ్న అడిగినా.. అందుకు సూటిగా స‌మాధానం చెప్ప‌ని హ‌నీ వైఖ‌రితో పోలీసులు త‌ల ప‌ట్టుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇద్ద‌రు సాధ్వీల‌ను లైంగికంగా వేధించిన కేసులో జైలుశిక్ష ప‌డిన నేప‌థ్యంలో పెద్ద ఎత్తున అల్ల‌ర్లు చోటు చేసుకున్నాయి. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్రాణాలు పోగొట్టుకోగా.. కోట్లాది రూపాయిల ఆస్తిన‌ష్టం వాటిల్లింది. ఈ అల్ల‌ర్ల‌కు ప్ర‌ధాన బాధ్య‌త హ‌నీప్రీత్ అన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీన్ని నిగ్గు తేల్చేందుకు పోలీసులు వేస్తున్న ప్ర‌శ్న‌ల‌కు క‌ర్ర విర‌గకుండా.. పాము చావ‌ని రీతిలో.. ఏమీ తేల్చుకోలేని స‌మాధానాలు ఇస్తోందట‌. ఆమె స‌మాధానాల‌తో ఇంకేం ప్ర‌శ్న‌లు వేయ‌టానికి వీల్లేని రీతిలో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు.. నాలుగు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పిన వెంట‌నే క‌ళ్లు తిరుగుతున్నాయ‌ని.. టీ కావాల‌ని.. ఇబ్బందిగా ఉంద‌న్న మాట‌లు చెబుతున్నార‌ని.. దీంతో.. పోలీసులు హ‌డావుడి ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఏదైనా అనారోగ్యంతో హ‌నీ ఉందా? అన్న సందేహంతో బీపీ.. ఈసీజీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించార‌ని.. అన్ని నార్మ‌ల్ గా ఉన్న‌ట్లుగా తేల్చ‌టం గ‌మ‌నార్హం.

పోలీసులు ఆమెకు సంధిస్తున్న ప్ర‌శ్న‌లు.. దానికి హ‌నీ ఇస్తున్న స‌మాధానాల‌కు సంబంధించి కొన్ని అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ ప్ర‌శ్న‌లు స‌మాధానాలు చూస్తే..

పోలీసు అధికారి: డేరాకు చెందిన జనాల్ని పంచకులకు ఎందుకు పిలిచారు..? ఎంతమందిని పిలవాలన్న‌ది మీ లక్ష్యం?

హనీప్రీత్: మేము అందరికీ ఒక విషయం చెప్పాం. కేసు తీర్పు వెలువడిన తరువాత సత్సంగం ఉంటుందని తెలియజేశాం. ఆ ప్లాన్ నాదే.... (త‌ర్వాత మౌనంగా ఉండిపోయారు)

పో.అ: దీని కోసం ఏ ఫోను నెంబర్ వాడారు?

హనీ: నాదగ్గర ఎప్పుడూ ఉండే నెంబరుతోనే ఫోన్ చేశా. తరువాత ఫోన్ పాడైపోయింది.

పో.అ: ఆదిత్యను చివరిగా ఎప్పుడు కలిశారు?

హనీ: ఎప్పుడు కలిశానో గుర్తులేదు.

పో.అ: మీ రెండో ఫోను ఎక్కడుంది?

హనీ: ఏ రెండోది. పోగొట్టుకున్నాను. ఎక్కడ పోగొట్టుకున్నానో తెలియదు.