Begin typing your search above and press return to search.
పుట్టబోయే బిడ్డ కోసమే బ్రతికున్నా:అమృత
By: Tupaki Desk | 16 Sep 2018 6:16 AM GMTమిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కులాంతర వివాహం చేసుకున్న కూతురు అమృత వర్షిణిపై కక్షగట్టిన తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్ లు ....కిరాయి హంతకులతో ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించడం కలచివేసింది.
నేడు ప్రణయ్ అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో ప్రణయ్ ఇంటికి అమృతను తీసుకువచ్చారు. తొలిసారి తన భర్త మృతదేహాన్ని చూసిన అమృత గుండెలవిసేలా రోదించింది. తన కళ్ల ముందే దారుణ హత్యకు గురైన భర్త మరణించడంతో షాక్ కు గురైన అమృత....ప్రణయ్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. ప్రణయ్ చనిపోయాడని తెలిసిన వెంటనే తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని అనుకున్నానని, కానీ - ప్రణయ్ ప్రతిరూపం తన కడుపులో పెరుగుతోందని - పుట్టబోయే బిడ్డలో ప్రణయ్ ను చూసుకోవడం కోసమే బ్రతికున్నానని వాపోయింది. ప్రణయ్ ఆత్మకు శాంతి కలిగేలా తన బిడ్డను చక్కగా పెంచుతానని అమృత కన్నీటిపర్యంతమై చెప్పింది. హృదయవిదారకంగా రోదిస్తోన్న అమృతను ఓదర్చడం అక్కడున్న బంధువుల వల్ల కాలేదు.
తామిద్దరం 9వ తరగతి నుంచే ప్రేమించుకున్నామని - తన ఇంట్లో కులాంతర వివాహాలను అంగీకరించబోరని తనకు తెలుసని చెప్పింది. వరుసకు అక్క అయ్యే తన బంధువుల అమ్మాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందని - బలవంతంగా ఆమె తాళిని తెంపిన బాబాయ్ వేరే పెళ్లి చేశారని చెప్పింది. జనవరిలో తాము పెళ్లి చేసుకున్న వెంటనే తండ్రి మారుతీరావు - బాబాయ్ శ్రవణ్ తనను తీవ్రంగా బెదిరించారని అమృత తెలిపింది. ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వబోమనీ హెచ్చరించారని తెలిపింది. తనను బాబాయ్ డంబెల్ తో కొట్టాడని - కింద పడేసి తన్నాడని చెప్పింది. తమకు ఆస్తులు వద్దని - తమ మానాన తమను బ్రతకనిస్తే చాలని ప్రాధేయపడ్డానని తెలిపింది. తన భర్తను చంపేందుకు ఇప్పటికే నాలుగు సార్లు ప్రయత్నించారని - అందుకే కొత్త ప్లేసెస్ కు వెళ్లాలంటే భయపడుతూ... ఎక్కడికీ వెళ్లేవాళ్లం కాదని చెప్పింది. తన భర్తకు అపాయముందని తెలుసని - తన తండ్రి ఇంత దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదని చెప్పింది. కానీ, ఆసుపత్రి ముందు పట్టపగలు నడిరోడ్డుపైనే హత్యకు ప్లాన్ చేస్తారని ఊహించలేదని కన్నీరు మున్నీరైంది. పోలీసులు - మీడియా ఉన్నారన్న ధైర్యంతోనే తాను ప్రేమ వివాహం చేసుకున్నానని - తనను ప్రణయ్ ఎంతో బాగా చూసుకునేవాడని చెప్పింది. తన తండ్రి మారుతీరావు - బాబాయ్ శ్రవణ్ తో పాటు మరో ఇద్దరిని కఠినంగా శిక్షించాలని - వారిని ఉరి తీయాలని కోరింది.