Begin typing your search above and press return to search.

ఆర్టికల్ 370 పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూఖ్

By:  Tupaki Desk   |   12 Oct 2020 3:45 AM GMT
ఆర్టికల్ 370 పై  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూఖ్
X
జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంపై మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్సు అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా సంచలన కామెంట్ చేశారు. డ్రాగన్ దేశం సహకారంతో జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో మళ్ళా ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరుగుతుందన్నారు. భారత్ పౌరులుగా ఉంటూ జమ్మూ-కాశ్మీర్లో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండేకంటే చైనా జాతీయులుగా ఉండటానికే తమ రాష్ట్రంలోని జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు ఆమధ్య చేసిన కామెంట్లు సంచలనమైంది.

దాదాపు ఏడు మాసాల క్రితం జమ్మూ-కాశ్మీర్ కున్న రాష్ట్ర హోదాను కేంద్రప్రభుత్వం పాక్షికంగా రద్దు చేసి - ఆర్టికల్ 370 ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్ద చేసేముందే రాష్ట్రంలోని మాజీ ముఖ్యమంత్రులు అబ్దుల్లాతో పాటు ముఫ్తీ మహబూబా - ఒమర్ అబ్దుల్లా లాంటి ప్రముఖులను కేంద్రం గృహనిర్భందంలో ఉంచిన విషయం అందరికీ తెలిసిందే. ఏడు నెలల నిర్భందం నుండి విడుదలైన ఫారూఖ్ విడతల వారీగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఇండియా టుడే తో మాట్లాడుతూ ఆర్టికల్ 370ని రాష్ట్ర పౌరులతో పాటు చైనా కూడా ఏనాడూ ఆమోదించలేదని చెప్పటం గమనార్హం.

నిజానికి ఫరూఖ వ్యాఖ్యల్లో అర్ధంలేదు. ఎందుకంటే జమ్మూ-కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయటం అన్నది పూర్తిగా దేశ అంతర్గత వ్యవహారం. దీనికి పొరుగునున్న పాకిస్ధాన్ కు కానీ డ్రాగన్ కు కానీ ఏ విధమైన సంబంధం లేదు. కానీ ఈ విషయాన్ని మరచిపోయిన ఫారూఖ్ ఆర్టికల్ 370 రద్దు చైనాకు సంబంధం లేదని చెప్పటమే విడ్డూరంగా ఉంది. కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆర్టికల్ 370ని కేంద్రం పునరుద్ధరిస్తుందన్ననమ్మకం తనకుందన్నారు. ఆర్టికల్ రద్దుపై పార్లమెంటులో మాట్లాడే అవకాశం తనకు కేంద్రప్రభుత్వం ఇవ్వలేదని ఫారూఖ్ మండిపోయారు.