Begin typing your search above and press return to search.

ఆశగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ రెఢీ.. ప్రజలకు చేరేందుకు మాత్రం?

By:  Tupaki Desk   |   4 Oct 2020 6:00 AM GMT
ఆశగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ రెఢీ.. ప్రజలకు చేరేందుకు మాత్రం?
X
యావత్ ప్రపంచం ఆశగా.. అంతకు మించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోవిడ్ 19 వ్యాక్సిన్ కు సంబంధించి మరో కీలకమైన అప్డేట్ గా దీన్ని చెప్పాలి. ప్రపంచం మొత్తమ్మీదా ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు వీలుగా వందకు పైగా వ్యాక్సిన్ ప్రయోగాలు సాగుతున్నాయి. ఈ ప్రయోగాల్లో టాప్ ఫైవ్ లో మొదటిగా అభివర్ణించే ఆక్స్ ఫర్డ్ టీకాకు సంబంధించి బ్రిటీష్ అధికారిక వర్గాలు ఆసక్తికర ప్రకటన ఒకటి చేశారు.

దీని ప్రకారం వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రయోగాలు ఈ ఏడాదికి పూర్తి చేసుకోనున్నట్లు చెప్పింది. వచ్చే ఏడాదికి వ్యాక్సిన్ సిద్ధమని.. ప్రజల వద్దకు చేరుకునేందుకు మాత్రం మరో ఆర్నెల్లు టైం కావాలని పేర్కొంది. ప్రయోగానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్ని ముగించుకొని ప్రజలకు చేరువ కావటానికి కనీసం ఆర్నెల్లు తప్పదని చెబుతున్నారు.

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి మొదటి రెండు ప్రయోగాలు సక్సెస్ కావటం.. కీలకమైన మూడో ప్రయోగం సైతం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం.. ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా డెవలప్ చేస్తున్న ఈ వ్యాక్సిన్.. ఈ ఏడాది చివరకు విడుదలయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపించింది. తాజాగా వెలువడిన అంచనాతో.. ప్రస్తుతానికి ఆర్నెల్లు అని చెప్పినా.. మరో మూడు నెలలు అదనంగా చేరే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. వ్యాక్సిన్ ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయటం ఒక ఎత్తు అయితే.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం అసలుసిసలు సవాలుగా చెప్పక తప్పదు. ఏమైనా.. వచ్చే ఏడాది వేసవి కాలం వరకు సామాన్యుల చేతికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం కనిపించటం లేదు.