Begin typing your search above and press return to search.
లవ్ చేయలేదని... నిద్రపోతుంటే పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు
By: Tupaki Desk | 29 Aug 2022 3:58 AM GMTప్రేమిస్తే ప్రేమించాలా? ప్రేమించినోడు తన ప్రేమను ప్రదర్శిస్తాడు సరే. కానీ.. అవతల వ్యక్తికి మనసు ఉంటుందని.. దానికి ఇష్టం ఉంటుందన్న విషయాన్ని వదిలేసి.. ప్రేమిస్తే.. ప్రేమించాలంతే అనే ఉన్మాదులు కొందరు కనిపిస్తుంటారు. వీడు అంతకు మించిన ఉన్మాది. తాను ప్రేమించిన అమ్మాయి.. తనను ప్రేమించటం లేదన్న కోపంతో నిద్రపోతున్న ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టేసిన దారుణానికి తెగబడ్డాడు. జార్ఖండ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడా రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారటంతో పాటు.. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉందంటున్నారు.
కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆగస్టు 23న ఈ ఉదంతం చోటు చేసుకుంది. జార్ఖండ్ లోని దుమ్కాలో పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే 19 ఏళ్ల అంకితను షారుక్ హుస్సేన్ అనే కుర్రాడు ప్రేమిస్తున్నట్లు వెంటపడేవాడు. ఆమెను వేధింపులకు గురి చేసేవాడు. అయితే.. ఆమె అందుకు అంగీకరించలేదు. పలు ప్రయత్నాలు చేసిన అతను.. అంకిత మీద కోపంతో దారుణానికి ఒడిగట్టాడు.
ఆగస్టు 23 తెల్లవారుజామున ఇంట్లో నిద్ర పోతున్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో తీవ్ర గాయాలు అయిన ఆమె రిమ్స్ లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మరణించింది. ఈ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
మరణించటానికి ముందు అంకిత ఇచ్చిన వాంగ్మూలంలో..'రాత్రి నిద్రపోయాను. ఏదో కాలుతున్న వాసన వచ్చినట్లు అనిపించింది. లేచి చూస్తే.. మంటలు రేగుతున్నాయి. అతడు వెళ్లిపోవటం చూశా. మంటలు మరింతగా అంటుకోవటంతో ఆ బాధతో కేకలు వేస్తూ మా నాన్న గదిలోకి వెళ్లా. మా ఇంట్లో వాళ్లు మంటలు ఆర్పి ఆసుపత్రిలో చేర్పించారు" అని పేర్కొంది.
అంకిత మరణం నేపథ్యంలో దుమ్కాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ.. భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేపట్టారు. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసేసి బంద్ పాటిస్తున్నారు.
తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో దుమ్కా సబ్ డివిజన్ లో 144వ సెక్షన్ విధించినట్లు పోలీసులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం అంకితకు ఫోన్ చేసిన షారుక్.. తనను ప్రేమించాలని.. లేదంటే చంపేస్తానని బెదిరించినట్లుగా అంకిత తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇలాంటి ప్రేమోన్మాదిని ఏం చేసినా తప్పు లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.