Begin typing your search above and press return to search.

పార్కింగ్, విజిటర్స్ రుసుంపై ఆ హాస్పిటల్ ఇష్టారాజ్యం!?

By:  Tupaki Desk   |   5 Aug 2021 4:30 PM GMT
పార్కింగ్, విజిటర్స్ రుసుంపై ఆ హాస్పిటల్ ఇష్టారాజ్యం!?
X
పార్కింగ్ ఫీజు మినహాయించాలని.. రోగుల నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయవద్దని హైకోర్టు ఆదేశించినా ఆస్పత్రి యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగానికి ఆస్పత్రి పార్కింగ్ ఫీజులపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆస్పత్రులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రోగుల నుంచి భారీ పార్కింగ్ రుసుములు వసూలు చేస్తూనే ఉన్నాయి.

తాజాగా హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యం పార్కింగ్ ఫీజును గంట వారీగా వసూలు చేస్తోందని రోగుల బంధువులు ఫిర్యాదు చేశారు. 12 గంటలకు రూ.100 వసూలు చేస్తోంది. ఇది చాలా ఎక్కువ అని రోగులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ నిబంధనల ప్రకారం రోగులకు ఉచిత పార్కింగ్ స్థలాన్ని అందించాలని.. కానీ వీరు అది పాటించడం లేదని చెబుతున్నారు.

గతంలో వాణిజ్య సంస్థలు/మల్టీప్లెక్సులు/మాల్ లు మరియు, మల్టీ ప్లెక్స్ లలో సేకరించిన పార్కింగ్ ఫీజును హేతుబద్దీకరించడానికి, నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో 63ని జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. తమ వాహనాన్ని పార్కింగ్ చేసిన మొదటి 30 నిమిషాల వరకు ఏ వ్యక్తి నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయరాదు. సమయం 30 నిమిషాలకు మించి ఉంటే వాహనాన్ని పార్క్ చేసిన వ్యక్తి సంబంధిత సంస్థలో షాపింగ్ చేసినట్లు రుజువుగా ఏదైనా మొత్తంలో బిల్లును ఉత్పత్తి చేస్తారు. తద్వారా పార్కింగ్ ఉచితంగా పెట్టారు. ఇతర సందర్భాల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు.

సదురు కార్పొరేట్ ఆస్పత్రి పార్కింగ్ ఫీజును వసూలుచేయడంపై తమ అసంతృప్తిని చాలా మంది సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు.