Begin typing your search above and press return to search.
కరోనా పేషేంట్ కి టిక్ టాక్ పిచ్చి..ఐసోలేషన్ వార్డ్ లో ఏంచేసిందంటే?
By: Tupaki Desk | 1 April 2020 1:30 AM GMTటిక్ టాక్ ..దీని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ టిక్ టాక్ ని వాడుతున్నారు. కొందరైతే ఈ టిక్ టాక్ లో అదే పనిగా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. ఎవరి పిచ్చి వారిది కానీ, దేనికైనా కూడా ఒక హద్దు అంటూ ఉండాలి. ఆ హద్దు దాటితే ..పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తాజాగా చెన్నై లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ప్రస్తుతం కరోనా మొత్తం ప్రపంచాన్నే వణికిస్తున్న విషయం తెలిసిందే. చెన్నై లో ఒక యువతికి కరోనా పాజిటివ్ రాగా ..ఆమెని ఐసోలేషన్ వార్డ్ లో పెట్టి కరోనా కి చికిత్స అందిస్తున్నారు. అయితే , ఆ యువతకి టిక్ టాక్ అంటే పిచ్చి ..దీనితో ఆ హాస్పిటల్స్ లో ఉన్న ముగ్గురికి మాయమాటలు చెప్పి ..వారి వద్దకి వెళ్లి టిక్ టాక్ వీడియోలు చేసి , పోస్ట్ చేసింది. ఆ వీడియోలు చూసిన కొంతమంది ఆ హాస్పిటల్ డైరెక్టర్ కి ఈ విషయాన్ని చెప్పగా ..ఆమెతో చనువుగా ఉన్న ముగ్గురు సిబ్బందిని విధుల నుండి తొలగించి ...కరోనా పేషేంట్ తో క్లోజ్ గా ఉన్న కారణం తో వారిని కూడా క్వారంటైన్ చేసారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు చూస్తే ...
తమిళనాడు లోని అరియలూరు ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతి వేలాచేరిలోని ప్రముఖ ఫినిక్స్ మాల్ లో ఉద్యోగం చేస్తున్నది. ఈమె మార్చి 24వ తేదీ చెన్నై నుంచి తిరిగి వచ్చింది. చెన్నై నుంచి వచ్చిన యువతికి జ్వరం ఎక్కవగా ఉండటం తో గత శుక్రవారం ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అందులో ఆమెకి పాజిటివ్ రావడంతో అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ మహిళా వార్డుకు తరలించారు.
ఆ యువతికి చాలాకాలం నుంచి టిక్ టాక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. టిక్ టాక్ వీడియోల పిచ్చి ఎక్కువగా ఉన్న యువతి ఆసుపత్రిలో కాలక్షేపం చెయ్యడానికి ఆమెకు అధికారులు, సిబ్బంది కొని పుస్తకాలు ఇచ్చారు. అయితే ఆ పుస్తకాలు చదవకుండా ఆ యువతి డిప్రెషన్ లోకి వెళ్లిందని తెలిసింది.
అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న యువతి అక్కడ పారిశుద్ద కార్మికులుగా పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు మాయమాటలు చెప్పి , ఆసుపత్రిలో అటూఇటూ తిరుగుతూ టిక్ టాక్ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ టిక్ టాక్ వీడియోలను చూసిన నెటిజన్లు అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రి సీనియర్ వైద్యులకు సమాచారం ఇచ్చారు. దీనితో వెంటనే స్పందించిన వైద్యులు ..ముగ్గురు ఉద్యోగులు యువతి మొబైల్ తీసుకుని టిక్ టాక్ వీడియోలు చిత్రీకరించడంతో పాటు ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారని ఆసుపత్రి వైద్యులు, సంబంధిత అధికారులు గుర్తించారు. యువతి సెల్ ఫోన్ చేతుల్లో పట్టుకోవడం, ఆమెతో సెల్ఫీలు తీసుకోవడంతో ఆ ముగ్గురు ఉద్యోగులకు కరోనా వైరస్ వ్యాపించి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ చికిత్స పొందుతున్న రోగితో కలిసిమెలసి తిరిగి ఆమెతో సెల్ఫీలు తీసుకున్న ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశామని అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రి సీనియర్ అధికారి మీడియాకు చెప్పారు. అంతే కాకుండా ముగ్గురు ఉద్యోగులను క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని అన్నారు. కరోనా వైరస్ రోగికి మొబైల్ ఫోన్ ఇవ్వడం చాల పెద్ద నేరమని, అంతే కాకుండా ఆ మొబైల్ తీసుకుని వీడియోలు తీసిన ముగ్గురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందని వెలుగు చూస్తే వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అధికారులు చెప్పారు. ఐసోలేషన్ వార్డ్ లో కరోనా కి చికిత్స తీసుకుంటున్న యువతి టిక్ టాక్ లో వీడియో లు చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతుంది.