Begin typing your search above and press return to search.

అమెరికా దారుణం: శవాలను తీసుకోవడం లేదు..

By:  Tupaki Desk   |   7 April 2020 9:50 AM GMT
అమెరికా దారుణం: శవాలను తీసుకోవడం లేదు..
X
అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. జనాలు కరోనాతో పిట్టల్లా రాలుతున్న పరిస్థితి దాపురించింది. మృతదేహాలను ఖననం చేయడానికి కూడా స్థలాల కొరత ఉంది. వీల్లేని పరిస్థితుల్లో మార్చురీల్లో భద్రపరుస్తారు. కరోనాతో మృతి చెందిన వారిని తీసుకెళ్లలేని దైన్యం కనిపిస్తోంది.

అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 3.37లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 9620కు చేరువగా ఉంది. అమెరికాలో ఈరోజు 330 మందికి పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. సామాన్యులు ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడం లేదు. ఇక వైద్యులు ఆరోగ్య కార్యకర్తలు ఇష్టపూర్వకంగా తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వారు ఇంటికి కూడా వెళ్లకుండా సేవలందిస్తున్న స్థితి అమెరికాలో నెలకొంది.

అగ్రరాజ్యం అమెరికాలో ముఖ్యంగా శ్రీమంతుల నగరంగా పేరుగాంచిన న్యూయార్క్ లో ఈ వైరస్ దెబ్బకు అతలాకుతలం అవుతోంది. ఈ ప్రాంతంలో వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. మృత్యువాత పడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది.

న్యూయార్క్ నగరంలో భయానక పరిస్థితులున్నాయి. ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటిపోయింది. 4వేలమందికిపై గా మరణించారు. మరణాల సంఖ్య పెరుగుతుండడంతో శ్మశాన వాటికల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. నిర్వాహకులపై ఒత్తిడి పెరుగుతోంది. ఒత్తిడి తట్టుకోలేక శ్మశాన వాటికల నిర్వాహకులు చేతులు ఎత్తివేస్తున్నారు.

దీంతో కరోనా డెడ్ బాడీలను కొంతకాలం పాటు ఆస్పత్రి మార్చురీలోనే భద్ర పరుస్తున్నారు. అయితే కొందరు కరోనాతో మృతిచెందిన తమ కుటుంబ సభ్యుల బాడీలను తీసుకెళ్లడం లేదు. దీంతో వారంతా అనాథ శవాలుగా మార్చురీలోనే ఉంటున్న దైన్యం కనిపిస్తోంది.

న్యూయార్క్ లోని బ్రూక్లిన్ శ్మశనా వాటికలో ఒకేసారి కేవలం 60 మృతదేహాలను ఖననం చేసే వీలుంది. అయితే న్యూయార్క్ లో ఒకేరోజు 200 మరణాలకు మించి నమోదై మృతదేహాలు రావడంతో ఏం చేయాలో పాలు పోక నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఖననం చేసే వీలు లేక రసాయనాలు పూసి మార్చురీ ఏసీ గదుల్లో భద్ర పరుస్తున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా కరోనా తో చనిపోయిన వారి శవాల కోసం అడగక పోవడం దారుణంగా ఉంది. ఇక శవాలను భద్రపచడానికి అమెరికాలో ఆరెంజ్ బ్యాగుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో దేంట్లోనే సంచుల్లో కుక్కి మార్చురీలో భద్రపరుస్తున్న దుస్థితి నెలకొంది.