Begin typing your search above and press return to search.
ఆసుపత్రులను జాతీయం చేయాలి
By: Tupaki Desk | 21 May 2021 10:30 AM GMTదేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత పెరిగిపోతున్న దృష్ట్యా జాతీయస్ధాయిలోని కొందరు వైద్యులు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు రాసిన లేఖ సంచలనంగా మారింది. దేశంలోని 47 మంది వైద్యులు ఎన్వీ రమణకు రాసిన లేఖలో దేశంలోని అన్నీ ప్రైవేటు ఆసుపత్రులను జాతీయం చేయాలని సూచించారు. కేంద్రప్రభుత్వంతో పాటు రాష్ట్రప్రభుత్వాలన్నీ కరోనా వైరస్ నియంత్రణలో దారుణంగా ఫెయిలైనట్లు తీవ్రంగా ఆరోపించారు.
ప్రజారోగ్యం మీద ఏమాత్రం శ్రద్ధలేకుండా ఎన్నికలు నిర్వహించిన కారణంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పెరిగిపోవటానికి కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా బాధ్యత వహించాల్సిందే అంటు మండిపడ్డారు. ఇదే సమయంలో మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు కూడా నోటికొచ్చింది మాట్లాడేస్తు, అశాస్త్రీయమైన విధానాలను ప్రచారం చేయటం ద్వారా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నట్లు ఆరోపించారు. గోమూత్రం తాగితే కరోనా తగ్గిపోతుందని, ఆవుపేడను ఒంటికి పూసుకుంటే కరోనా రాదని లేదా తగ్గిపోతుందనే అశాస్త్రీయ విధానాలను ప్రజాప్రతినిధులు బాగా ప్రచారం చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఒకవైపు కరోనా సమస్య పెరిగిపోతున్నా డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకం, ఆక్సిజన్ ఉత్పత్తి పెంచటం, సరఫరా, ఆసుపత్రుల నిర్మాణం, బెడ్ల ఏర్పాట్లు, మెడిసిన్, కోవిడ్ కేంద్రాల ఏర్పాటు లాంటి అంశాలపై ప్రభుత్వాల దగ్గర కనీస ప్రోగ్రామ్ కూడా లేదంటు రెచ్చిపోయారు. మృతుల విషయంలో లెక్కలు తక్కువ చూపించటం కోసం డెడ్ బాడీస్ ను నదుల్లోకి విసిరేస్తున్నట్లు ఆరోపించారు.
కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాల ఉత్పత్తికి చర్యలు తీసుకోవాల్సిన కేంద్రప్రభుత్వం అసలా విషయాన్నే గాలికొదిలేసినట్లు మండిపడ్డారు. మిగిలిన కంపెనీల టీకాలను మార్కెట్లోకి రాకుండా కేంద్రం అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావించారు. కరోనా వైరస్ తీవ్రత పెరిగిపోవటానికి ప్రధాన కారణం పాలకుల వైఫల్యమే అంటు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పనిలో పనిగా దీనికి పరిష్కార మార్గాలు కూడా సూచించారు.
దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ జాతీయం చేయాలన్నారు. కార్పొరేట్ మాఫియాను అరికట్టాలన్నారు. ప్రతి మండలంలోని వెయ్యిపడకల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలట. ప్రభుత్వ ఖర్చులతోనే అంబులెన్సుల ఏర్పాటు జరగాలట. పూర్తిస్ధాయిలో వైద్య నియామకాలు జరగాలని, పౌరులందరికీ ఉచిత వ్యాక్సిన్లను అందించాలన్నారు. కోవిడ్ పరీక్షా కేంద్రాలను, వ్యాక్సినేషన్ కేంద్రాలను వేర్వేరుగా ఉంచాలన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నవారిని శిక్షించాలనేటువంటి అనేక సూచనలు చేశారు.