Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ ఎఫెక్ట్: రోడ్డున పడ్డారు..
By: Tupaki Desk | 25 March 2020 9:30 AM GMTదేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. బయటకు వెళితే పోలీసులు లాఠీలతో కొట్టి చంపుతున్నారు. దీంతో ఇంట్లోనే ఉంటున్న పరిస్థితి. అయితే విద్య, ఉద్యోగాల కోసం నగరాలు, పట్టణాల్లో ఉంటున్న వారికి లాక్ డౌన్ శరాఘాతంగా మారింది. ప్రైవేటు హాస్టల్స్ మూసివేయాలని పోలీసులు ఆదేశించడంతో హాస్టళ్లని మూసివేశారు. దీంతో విద్యార్థులు , ఉద్యోగులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు.
బస్సు, రైళ్లు, ఇతర రవాణా సౌకర్యాలను ఆపివేయడంతో ఇప్పుడు వారంతా ఏం చేయాలో తెలియక తాజాగా పోలీస్ స్టేషన్ చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
ప్రస్తుతం హాస్టల్ ఖాళీ చేసిన వారిని సొంతూళ్లకు వెళ్లడానికి పోలీసులు అనుమతించడం లేదు. హాస్టళ్లలోనూ హాస్టల్ యాజమానులు ఉండనీయడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థులు - ఉద్యోగులు తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లను ముట్టడించారు. పంజాగుట్ట, అమీర్ పేట హాస్టళ్లలోంచి తమను తరిమేశారని.. ఊళ్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యాలు లేవని.. పోలీసులు వెళ్లనీయడం లేదని.. తమ పరిస్థితి ఏంటని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. వీరిని పోలీసులు ఎలా ఊళ్లకు తరలిస్తారన్నది అయోమంగా మారింది.