Begin typing your search above and press return to search.
వార్నర్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన హాట్ హీరోయిన్..!
By: Tupaki Desk | 26 April 2021 11:30 AM GMTనిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని తెలుగు ప్రేక్షకులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ టైగా నిలవగా సూపర్ ఓవర్ లో ఢిల్లీ గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లు ఆడి నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పృథ్వీ షా 53 పరుగులు, స్టీవ్ స్మిత్ 34 పరుగులు చేశారు. ఇక 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు కూడా 20 ఓవర్లలో సరిగ్గా 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా నిలిచింది.
సూపర్ ఓవర్ లో మొదట హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేయడానికి రాగా, వార్నర్, విలియమ్సన్ క్రీజులోకి వచ్చారు. ఢిల్లీ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్లో కేవలం 7 పరుగులే వచ్చాయి. హైదరాబాద్ నుంచి రషీద్ ఖాన్ బౌలింగ్ చేయడానికి రాగా, ఢిల్లీ జట్టు నుంచి పంత్, ధవన్ 6 బంతుల్లో 8 పరుగులు పూర్తి చేసి విజయాన్ని అందుకున్నారు.
అయితే సూపర్ ఓవర్ లో కెప్టెన్ వార్నర్ రావడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. వార్నర్ రాకుండా ఆ ప్లేస్ లో బెయిర్‌స్టో లేదా సుచిత్ వచ్చి ఉంటే స్కోర్ ఎక్కువగా ఉండేదేమోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
నిన్న మ్యాచ్ ఓడిపోయినప్పటి నుంచి నెటిజన్లు దీన్నే ట్రోల్ చేస్తున్నారు. వార్నర్ భాయ్ ఏంది ఇది? అంటూ మీమ్స్ తో ట్రోల్స్ చేస్తున్నారు. అసలు నువ్వెందుకు వచ్చావు. సూపర్ ఓవర్ లో..అంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నటి ఈశా రెబ్బ కూడా ఈ విషయం పై స్పందించింది. ఈషా రెబ్బా తెరమీద అందాలు ఆరబోయడం మాత్రమే కాదు. ఐపీఎల్ ను కూడా బాగా ఫాలో అవుతూ ఉంటుంది. అంతేకాదు ఆమె సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్ కూడా.
మన తెలుగు పిల్ల కాబట్టి హైదరాబాద్ జట్టును బాగా అభిమానిస్తుంది. ఒక్క ఇషారెబ్బ మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ జట్టు మాత్రం ఈ సారి అనుకున్న రేంజ్ లో ఆడటం లేదు. నిన్న ఎస్ఆర్హెచ్ ఆటతీరు, తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రముఖ నటి ఈషా రెబ్బ ను కూడా అసంతృప్తికి గురిచేసినట్టు ఉంది.
అందుకే ఆమె నేరుగా వార్నర్ పై విమర్శలు చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. ’వార్నర్ భాయ్ ఏంటి ఇది. అసలు సూపర్ ఓవర్ లో నువ్వు ఎందుకు వచ్చావు. బెయిర్ స్టో లేదా సుచిత్ వచ్చి ఉంటే ఎక్కువ స్కోర్ వచ్చేది కదా’ అంటూ ప్రశ్నించింది. ఒక్క ఈషా రెబ్బ మాత్రమే కాదు. చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఇదే రకమైన కామెంట్లు పెడుతున్నారు. ఈ కామెంట్లపై వార్నర్ ఎలా స్పందిస్తాడో? వేచి చూడాలి.