Begin typing your search above and press return to search.
అందరికి సాయం అందిస్తాం సరే.. 2 నెలల్లో ఇవ్వటమా జగన్?
By: Tupaki Desk | 28 July 2022 4:41 AM GMT‘ఆకలితో ప్రాణాలు పోయేలా ఉంది.. కాసింత పెట్టి పుణ్యం కట్టుకోండి సామీ’.. అన్నోడికి రెండు రోజులు ఆగు.. మాంచి బిర్యానీ తయారు చేసి పెడతా? అంటే ఎలా ఉంటుంది? కాలిపోదా? ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీలోని వరదల్లో నష్టపోయిన ప్రజల విషయంలోనూ ఉంది. భారీ వర్షాలు.. ఆపై వచ్చిన వరదల కారణంగా దారుణంగా దెబ్బ తిన్న వేలాది మంది సాయం కోసం హాహాకారాలు చేస్తున్న పరిస్థితి. వరదల తాకిడికి సర్వం పోగొట్టుకున్న వారు కొందరైతే.. భారీగా నష్టపోయిన వారు ఇంకొందరు. మొత్తంగా నష్టపోవటం మాత్రం పెద్ద ఎత్తునే జరిగింది.
ఇలాంటి వారిని ఆదుకునేందుకు.. వరదలు పోటెత్తి.. విపక్ష నేతలు వరద ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత.. తన పరామర్శ ప్రోగ్రాంను షురూ చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హుదూద్ తుపాన్ వేళ.. రెండో రోజుకే నాటి సీఎం చంద్రబాబు విశాఖకు చేరుకొని.. విశాఖ కలెక్టరేట్ ఆవరణలో వాహనాన్ని ఏర్పాటు చేసుకొని.. రోజుకు18 -20 గంటల పాటు పని చేయటం.. అధికారయంత్రాగాన్ని పరుగులు తీయించి మరీ.. విశాఖను పునురుద్దరించటం చేయటం తెలిసిందే.
అలాంటి ఉదంతాల్ని చూసిన ఏపీ ప్రజలకు.. ముఖ్యమంత్రి జగన్ తాజాగా వ్యవహరిస్తున్న తీరు పలు ప్రశ్నల్ని సంధించేలా చేస్తోంది. వరదల్లో నష్టపోయిన వారిని పరామర్శించటానికి వారానికి పైనే సమయం తీసుకున్న సీఎం.. ఇప్పుడు బాధితులందరిని ఆదుకుంటామని.. నష్టపోయిన మొత్తాన్ని బాధితులకు రెండు నెలల్లో అందజేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పే మాటలు వింటే అవాక్కు అవ్వాల్సిందే.
ప్రపంచంలో మరెక్కడా కూడా..విపత్తు వేళ నష్టపోయిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే ప్రభుత్వం ఎక్కడా లేదనే చెప్పాలి. అలాంటిది ఆదాయం అరకొరగా ఉండి.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాల్ని ఆలస్యంగా ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. వరదల్లో నష్టపోయిన వారందరికి పరిహారం అందిస్తానని చెప్పటం ఒక ఎత్తు అయితే.. ఆ చెల్లింపులు తాను కాదని.. కేంద్రంలోని మోడీ సర్కారు చేస్తుందని చెప్పటం మాత్రం హైలెట్ అంశంగా చెప్పాలి.
అప్పటి హూదూద్ లాంటి విపత్తు వేళలో కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన సాయం తెలిసిన వారు.. ఇప్పుడు జరిగిన నష్టానికి కేంద్రం నుంచి అందునా మోడీ సర్కారు నుంచి పరిహారం వస్తుందనుకోవటానికి మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ఏలూరు.. అల్లూరి సీతారామారాజు జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా నష్టపోయిన కుటుంబాలకు ఇప్పటికే రేషన్.. ప్రతి కుటుంబానికి రూ.2వేలు సాయం అందించటాన్ని చాలా గొప్పగా చెప్పుకోవటం సీఎం జగన్ కే చెల్లుతుంది.
ఎందుకంటే.. సర్వం పోయిన వేలాది మందికి.. ఇంట్లో పేరుకు పోయిన బురదను తొలగించటానికే ఐదారువేలు ఖర్చు అయ్యే పరిస్థితి. ఇంట్లోని ఎలక్ట్రిక్ ఉపకరణాలు.. రోజువారీగా వాడుకోవాల్సిన వస్తువులకే పది వేలకు పైగా ఖర్చు అయ్యే పరిస్థితి. అలాంటిది ఎందుకు కొరగాని రూ.2వేలు సాయాన్ని ప్రకటించటం చూసినప్పుడు ఆ మొత్తం దేనికి సరిపోదని మాత్రం చెప్పక తప్పదు. ఇక.. తాటాకు గుడిసెలో ఉన్న వారికి నష్టపరిహారాన్ని రూ.5వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పినా.. ఆ మొత్తం చేతికి అందేది ఎప్పుడన్నది ప్రశ్న. ఏమైనా.. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అందాల్సిన పరిహారాన్ని రెండు నెలల తర్వాత.. అది కూడా కేంద్రం నుంచి ఇప్పిస్తానని చెప్పటం చూస్తే.. జగన్ గొప్ప మనసుకు ఫిదా కావాల్సిందే.