Begin typing your search above and press return to search.

రూ. 10 కే బిర్యానీ..యజమాని అరెస్ట్ ..కారణం ఏంటంటే ?

By:  Tupaki Desk   |   22 Oct 2020 2:30 AM GMT
రూ. 10 కే బిర్యానీ..యజమాని అరెస్ట్ ..కారణం ఏంటంటే ?
X
ఈ రోజుల్లో పది రూపాయలకు ఏం వస్తుందో టక్కున చెప్పలేం. అలాంటిది పది రూపాయలకు కడుపునిండా బిర్యానీ లభిస్తే ఎలా ఉంటుంది. వినడానికే వింతగా ఉన్న ఇది అక్షరాలా నిజం. సాధారణంగా రెస్టారెంట్ లలో ఫలానా ఫుడ్ తీసుకంటే..ఇంకో రకమైన ఫుడ్ ఫ్రీ, కూల్ డ్రింగ్ ఉచితం అంటూ ప్రకటనలు గుప్పిస్తుంటారు. ప్రస్తుతం రూట్ మారిపోతోంది. కేవలం ప్రారంభం రోజునే తక్కువ ధరకే ఆహారం అందిస్తున్నామని కస్టమర్లను ఆకట్టుకొనేందుకు ట్రై చేస్తున్నారు.మరి ఎక్కువగా ప్రవర్తిస్తుండడంతో వారికి చెక్ పెడుతున్నారు పోలీసులు. రూ. 10కే బిర్యానీ అందిస్తానన్న యజమానిని అరెస్టు చేశారు పోలీసులు. అదేంటి పది రూపాయలకే బిర్యానీ ఇస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా , దానికి ఓ లెక్క ఉంది అదేంటో చూద్దాం.

తమిళనాడు రాష్ట్రంలో అరుపుకోట్టాయికి చెందిన జహీర్ హుస్సేన్ స్థానికంగా బిర్యానీ షాపు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం ప్లేట్ బిర్యానీ రూ. 10కే అంటూ యాడ్ ప్రకటించాడు.అంతే.. ఆదివారం ఉదయం 11 గంటలకు బిర్యానీ షాపు ముందు జనాలు క్యూ కట్టారు. కరోనా నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోలేదు. సోషల్ డిస్టెన్స్ పాటించలేదు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో..ఇలా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించారు. బారులు తీరిన వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ఫలితంగా తోపులాట ప్రారంభమై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ప్రధానంగా కొవిడ్ నిబంధనల్ని గాలికొదిలేశారు. వాళ్లలో చాలా మంది మాస్కులు కూడా పెట్టుకోకపోవడంతో పోలీసులు హోటల్‌ యాజమానిపై చర్యలు తీసుకున్నారు. అతనిపై, 188, 269, 278 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐతే ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని హెచ్చరించి బెయిల్ పై విడుదల చేసారు.