Begin typing your search above and press return to search.
ఆర్మీ రిప్లై: కౌరవులు..పాండవుల పోరు ఇది
By: Tupaki Desk | 26 Feb 2019 1:48 PM GMTఉగ్రమూకల కృరత్వానికి పరాకాష్టగా జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు భారత వైమానిక దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డాయి. మొత్తం 12 మిరాజ్ -2000 యుద్ధ విమానాలు కలిసి 1000 కేజీల బాంబులతో ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశాయి. భారత వైమానిక దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. అయితే 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలు కేవలం 21 నిమిషాల్లోనే తమ పనిని ముగించుకుని తిరిగి భారత్ లోని తమ బేస్ క్యాంపులకు చేరుకున్నాయి.
అయితే, నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడి చేసిన అనంతరం భారత ఆర్మీ అధికారిక ట్విటర్ లో ఓ పద్యాన్ని పోస్ట్ చేసింది. ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ సింగ్ రాసిన ఈ పద్యాన్ని ఏడీజీ పీఐ (అడిషనల్ డైరెక్టర్ జనరల్ - పబ్లిక్ ఇన్ ఫర్మేషన్) భారత ఆర్మీ అధికారిక ట్విటర్ లో పోస్ట్ చేసింది. ‘ఓ శత్రువు ముందు నువ్వు నిజాయతీగా ఉంటే.. అది నీ చేతకానితనం అనుకుంటాడు. కౌరవులు పాండవులను చిన్నచూపు చూసినట్లు.. మనం మంచి స్థాయిలో ఉండి.. గెలిచే సత్తా ఉంటేనే శాంతి చేకూరుతుంది’ అని పేర్కొంది. ఈ పోస్ట్ కు ‘భారత ఆర్మీ.. ఎల్లప్పుడూ సిద్ధమే..’ అన్న హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే 30వేల మంది లైక్స్ - 14 వేల మందికి పైగా రీట్వీట్లు చేశారు.
కాగా, ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం చేసిన దాడిపై ఇవాళ విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మాట్లాడారు. బాల్కోట్ లో జైషే ఉగ్రవాద సంస్థకు చెందిన అతిపెద్ద స్థావరంపై దాడి జరిగినట్లు ఆయన ద్రువీకరించారు. వైమానిక దళం చేసిన దాడిలో.. జైషే సంస్థకు చెందిన ఉగ్రవాదులు - ట్రైనర్లు - సీనియర్ కమాండర్లు - జిహాదీలు హతమైనట్లు ఆయన తెలిపారు. పుల్వామా దాడి తర్వాత జైష్ మహ్మద్ సంస్థ మరో దాడికి పన్నాగం వేసినట్లు తెలిసిందని, దేశంలోని మరికొన్ని చోట్ల సూసైడ్ దాడులకు పాల్పడేందుకు ప్లాన్ వేశారు. దీని కోసం ఫిదాయిన్ జిహాదీలు కూడా తయారైనట్లు ఆయన చెప్పారు. అయితే వైమానిక దాడిలో వాళ్లంతా హతమైనట్లు విజయ్ గోఖలే చెప్పారు. బాల్ కోట్ లోని జైషే క్యాంపును మౌలానా యూసుఫ్ అజర్ అలియాస్ ఉస్తాద్ ఘౌరి నిర్వహిస్తున్నాడు. జైషే చీఫ్ మసూద్ అజర్ కు బావమరిదే ఉస్తాద్. ఉగ్రవాదంపై పోరుకు భారత్ కట్టుబడి ఉందని, వైమానిక దాడితో జైషే క్యాంపును టార్గెట్ చేశామని, సాధారణ పౌరులకు ఎటువంటి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో దాడిని ప్లాన్ చేశామన్నారు.