Begin typing your search above and press return to search.

ఇంట్లో పనితో ఆయుష్సు.. ఇంతలాభమా?

By:  Tupaki Desk   |   26 Aug 2019 1:30 AM GMT
ఇంట్లో పనితో ఆయుష్సు.. ఇంతలాభమా?
X
మగాడు అంటే ఆఫీసుకెళ్లి సంపాదించాలి.. ఆడవాళ్లు అంటే ఇంట్లో ఉండి ఇంటిపని - వంటపని చేయాలనేది సంప్రదాయంగా మార్చేశారు కొందరు పురుష పుంగవులు. అసలు ఇంట్లో అటు పుల్ల తీసి ఇటు వేయరు. సర్వం భార్యలతో చేయించుకుంటారు. అలాంటి వారికి ఘాటు హెచ్చరిక చేశారు లీసిస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు.. తాజాగా బద్ధకస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.

లీసిస్టర్ వర్సిటీ పరిశోధకులు తాజాగా ఇంట్లో పనులు చేయకుండా కుర్చీ లేదా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కాలక్షేపం చేసే వారి ఆయుష్సు తొందరగా పోతుందని తేల్చారు. దీనికోసం వారు 1000 మందిపై పరిశోధనలు చేసి నిగ్గు తేల్చారు. ఇంట్లో అటూ ఇటూ తిరగకుండా కదలకుండా భార్యలతో పనులు చేయించుకునే వారు తొందరగా పైకి పోతారని తేల్చారు.

ఇక ఈ 1000 మందిలో ఇంట్లో వంటపని.. ఇంటిపని.. మొక్కలకు నీళ్లు పోస్తూ అంట్లూ తోముతూ భార్యకు సహకరించిన వారి ఆయుష్సు పెరిగిందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

ప్రతీరోజు ఇంట్లో కనీసం 24 నిమిషాల పాటు శారీరక శ్రమ చేసిన పురుషుల జీవితకాలం పెరిగిందని పరిశోధనలో తేలింది. అదే పనిచేయని వారు 10 ఏళ్ల ముందే చనిపోయారని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇక ఇప్పటికైనా ఇంటికి రాగానే టీవీ ముందు కూర్చొనే మగాళ్లందరూ కాస్తా ఇంట్లో పనులు చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు పరిశోధకులు.