Begin typing your search above and press return to search.
ఒక ఇల్లు కొంటే...రెండు పౌరసత్వాలు!
By: Tupaki Desk | 13 Jun 2017 10:51 AM GMTఒక ఇల్లు కొంటే రెండు పౌరసత్వాలు ఫ్రీ! ఇదేదో ఫ్లాష్ సేల్ లో బంపర్ ఆఫర్ లా ఉందనుకుంటున్నారా? అవునండీ! ఆ ఇంటిని కొంటే అమెరికా - కెనడా దేశాల్లో ఏకకాలంలో నివసించవచ్చు.
అమెరికాలోని వెర్మోంట్ - కెనడాలోని క్యూబెక్ ల మధ్య 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఇల్లు ఉంది. బ్రియాన్ - జాన్ లు దానిని 40 సంవత్సరాల క్రితం కొన్నారు. దాని ఖరీదు అక్షరాల రూ.71 లక్షలు. ఆ ఇల్లు సరిగ్గా కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ - అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ పోస్ట్ ల మధ్యలో ఉంది.
ఆ ఇంటిని అమ్మడానికి బ్రియాన్ - జాన్ లు సిద్ధంగా ఉన్నారు. కొనడానికి కూడా రోజుకు పది మంది వరకు వచ్చి వెళ్తున్నారు. ఎవరూ కొనడం లేదు. ఆ ఇంటిలో ఒక సగం అమెరికా సరిహద్దులో, మరో సగం కెనడా సరిహద్దులో ఉండడమే ఇందుకు కారణం.
ఆ ఇంటిని కొనడానికి కెనడాకు చెందిన కుటుంబం ఒకటి వచ్చింది. వారు ఆ ఇంట్లోని అమెరికా సగభాగంలోకి అడుగుపెట్టగానే కెనడా బోర్డర్ అధికారులకు రిపోర్ట్ చేయాలి. అనుమతులు - రాతకోతలకు సంబంధించిన కార్యక్రమం పూర్తవడానికి 45 నిమిషాలు పట్టింది. ఇటువంటి దౌత్యపరమైన చిక్కులను తట్టుకుని తమ ఇంటిని కొనే వారి కోసం బ్రియాన్ - జాన్ లు ఆశగా ఎదురు చూస్తున్నారు!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/