Begin typing your search above and press return to search.

హైకోర్టు లో జగన్ సర్కార్ కి దెబ్బ మీద దెబ్బ !

By:  Tupaki Desk   |   18 Aug 2020 2:30 PM GMT
హైకోర్టు లో జగన్ సర్కార్ కి దెబ్బ మీద దెబ్బ !
X
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలనీ , ఆ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలు చేయాలనుకున్న ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన స్థలాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దు అని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ తిరుమలగిరిలోని ట్రైబల్ స్కూల్స్ స్థలం ఇళ్ల పట్టాలుగా ఇవ్వటాన్ని తప్పుపడుతూ దాఖలు చేసిన పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల స్థలాల్లో భూములను ఇళ్ల పట్టాలుగా ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అమరావతి భూములు కూడా ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలోని పలు వివాదంలో ఉన్న భూములు కూడా ఉన్నాయి. అమరావతి భూములు, ఇతర భూములకు సంబంధించి పలు న్యాయపరమైన చిక్కులు ఎదురౌతున్నాయి. అమరావతిలో భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలన్న జగన్ సర్కారు నిర్ణయంపై అమరావతి రైతులు కోర్టుకు వెళ్లడంతో దానికి బ్రేక్ పడింది. హైకోర్టు నిర్ణయం మీద జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ సర్కారుకు చుక్కెదురైంది. ఇలాంటి సమస్యల నేపథ్యంలో ఇప్పటికి ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది.

ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీలో న్యాయపరమైన సమస్యల కారణంగా ఈ కార్యక్రమం పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఆగస్టు 15న నిర్వహించాలని భావించిన ఈ కార్యక్రమం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే కోర్టులో దీనిపై చర్చలు జరుగుతుండటంతో చూడాలి మరి ఈసారైనా ప్రభుత్వం ఇస్తుందో లేక మళ్లీ డేట్ ఏమైనా మారుతుందో.