Begin typing your search above and press return to search.

ఇంటి అద్దెకు ఒత్తిడి చేస్తే.. కేసులు తప్పవా?

By:  Tupaki Desk   |   29 March 2020 12:04 PM GMT
ఇంటి అద్దెకు ఒత్తిడి చేస్తే.. కేసులు తప్పవా?
X
చూస్తుండగానే.. క్యాలెండర్లో మరో నెల కరిగిపోయినట్లే. మహా అయితే మరో రెండు మాత్రమే మిగిలాయి. ఒకటో తారీఖు వచ్చినంతనే ఇంటి అద్దె.. పాలోడు.. కేబులోడు.. గ్యాస్ బండ.. ఇలా చెప్పుకుంటూ ఇవ్వాల్సిన లిస్టు చాలానే ఉంటుంది. ఇప్పటికే ఆర్ బీఐ ప్రకటించిన మార్గదర్శకాల నేపథ్యంలో అన్ని రకాల బ్యాంకు రుణాలపై మూడు నెలల మారిటోరియం విధించిన వైనం తెలిసిందే. మరి.. సొంతిల్లు లేకుండా.. అద్దె ఇంట్లో కాలం గడిపేటోళ్లు.. వ్యాపార.. వాణిజ్య సముదాయాలకు చెల్లించాల్సిన అద్దె విషయంలో వ్యాపారులు చెల్లింపులు జరపాల్సిన వైనంపై ఏం జరుగుతుంది? అన్నదిప్పుడు సమస్య.

ఇలాంటివేళ.. అద్దెకు ఉండేవారికి తీపికబురు చెబుతూ కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. అద్దె ఇంట్లో ఉండే వారికి ఇంటి యజమానులు సహకరించాలని కోరుతున్నారు. ఇలాంటి వేళ.. అద్దెకు ఉంటే.. వారి విషయంలో యజమానులు సానుకూలంగా వ్యవహరించాలి. అద్దె విషయంలో పట్టుబడ్టకూడదని.. ఒకవేళ అద్దె కోసం ఒత్తిడి తెస్తే.. వారిపై చర్యలు తీసుకుంటామని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గూబా చెప్పారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వలస కూలీల కదలికలు పెద్ద ఎత్తున ఉన్నాయని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒకటో తారీఖు దగ్గరకు వస్తున్న వేళ.. గుండెలు అదురుతున్న అద్దెదారులకు.. తాజా ప్రకటన కొంతమేర సాంత్వనగా మారుతుందని చెప్పక తప్పదు.