Begin typing your search above and press return to search.

ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదాకు కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   6 July 2020 4:00 PM GMT
ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదాకు కారణం ఇదేనా?
X
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలోని అన్ని హామీలను సీఎం జగన్ పట్టుబట్టి మరీ నెరవేరుస్తున్నాడు. ఇప్పటికే 90శాతం హామీలు పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా 30లక్షల మహిళలకు పెద్దఎత్తున ఇళ్ల పట్టాలు ఈనెల 8న వైఎస్ఆర్ జయంతి నాడు ఇవ్వాలి అని ఎప్పుడో నిర్ణయించారు. కానీ ఈరోజు ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఎందుకంటే అర్హులకు కాకుండా అనర్హులకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు కేటాయించినట్టు కంప్యూటర్ లో చూపిస్తోందట.. అర్హులకు దాదాపు 90శాతం రాలేదు అని ఏదో గోల్ మాల్ జరిగిందని భావించి వాయిదావేశారని సమాచారం.

అసలు విషయంకు వస్తే.. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఇబ్బడిముబ్బడిగా అనర్హులకు పోతున్నాయని సంక్షేమ పథకాలు కట్ చేయాలని ఒక సాధికార సర్వే చేశారు. ఆ సర్వేలో అప్పటి టీడీపీ జన్మభూమి కమిటీ వాళ్లు మేనేజ్ చేసుకొని వాళ్లకు అనుకూలంగా మార్చేసుకున్నారట.. టీడీపీ నాయకులకి అన్ని ఉన్నా రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాలు వచ్చేటట్టు సర్వేలో చేసుకున్నారని టాక్.

ఉదాహరణకు విజయవాడలో 5 అంతస్థుల భవనం ఉన్న ఒక టీడీపీ నాయకుడికి తెల్లరేషన్ కార్డ్ వచ్చేలా చేసుకున్నారట.. అతడికి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయంట..ఎందుకంటే సాధికారక సర్వేలో అలా చెప్పించారంట..

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు అదే సాధికారిక సర్వే వాడుతున్నారంట.. పేద ప్రజలకు కాకుండా టీడీపీ నాయకులకి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు మంజూరయ్యాయని వైసీపీ నాయకులు ఫిర్యాదులు చేశారట.. దీని మీద సమగ్ర సర్వే జరగాలి అని ప్రజలు కూడా కోరుకుంటున్నారు అని ప్రభుత్వంకు ఒక రిపోర్ట్ వచ్చింది. అందుకే ఇళ్లస్థలాల పంపిణీని జగన్ ఇంత అర్జంటుగా వాయిదా వేశారట.. ఖచ్చితంగా స్థలాలు ఇళ్లు లేని పేదలకు అందించాలని.. ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని వైఎస్ఆర్ జయంతి నాడు పంచాల్సిన స్థలాల పంపిణీని వాయిదా వేసినట్టు తెలిసింది.