Begin typing your search above and press return to search.
కరోనాని తప్పించుకోవడానికి బయటకి ఎలా వెళ్లిందంటే !
By: Tupaki Desk | 29 March 2020 2:30 AM GMTప్రపంచం వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉండటంతో బయటకు రావడానికి ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని మాస్క్ లతో, గ్లౌజులతో సిద్ధమవుతున్నారు. లండన్ లోని ఓ మహిళ దీని కోసం ఒక సరికొత్త ప్రయత్నం చేసింది. జోర్బ్ బాల్ లో నడుచుకుంటూ షాపింగ్ కు వెళ్లింది. నిత్యవసర వస్తువులు కొనుక్కునేందుకు హెర్నె బే అనే మహిళ ఈ ఫీట్ చేసిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షాపింగ్ మాల్ లోకి ఎంటరవగానే ఇతర కస్టమర్లు ఆమెకు సైడ్ ఇస్తూ సహకరించారు. ఆమె స్టోర్ లోకి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తి తన వెంటే ఉండి కావలసినవన్నీ సమకూర్చి జాగ్రత్తలు తీసుకున్నాడు. షెల్ఫ్ లలో ఉన్న వస్తువులు తీసుకుంటూ ఉండగా ఆ వ్యక్తి పదేపదే ఆ బంతిని తుడుస్తూ ఆమెతో సంభాషణ జరుపుతూ కనిపించాడు. ఆ వ్యక్తిని మహిళ గురించి అడగ్గా ఆమెకు జెర్మాఫోబియా ఉందని, సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉందని చెబుతున్నాడు. ఇతర కస్టమర్లు రబ్బరు బంతితో ఆమె షాపింగ్ కు రావడంతో ఆమెను చూసి నవ్వుకుంటున్నారు. షాపింగ్ చేసుకుని బయటకు వెళ్లిపోయిందని ఆమె కోసం ఇద్దరు ఎస్కార్ట్ లు కూడా వచ్చారు.