Begin typing your search above and press return to search.
అభినందన్ ఇండియా చేరేది ఇలా..
By: Tupaki Desk | 1 March 2019 9:49 AM GMTఅభినందన్.. పాక్ విమానాలను తరిమికొట్టి ఆ దేశ ఆర్మీకి చిక్కుకుపోయిన ఈ భారత విమాన పైలెట్ కోసం ఇప్పుడు దేశం మొత్తం ఎదురుచూస్తోంది. పాక్ చెరలో ఉన్న అభినందన్ ను శుక్రవారం నాలుగు గంటలలోపు వాఘా సరిహద్దు వద్ద ఇండియన్ ఆర్మీకి పాక్ ఆర్మీ అప్పగించనుంది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అభినందన్ వాఘా వద్దకు చేరుకునే అవకాశాలున్నాయి.
అభినందన్ రాక ఆలస్యమవుతోంది. సాయంత్రం 4 గంటల తర్వాత వస్తారని సమాచారం. అభినందన్ ను అప్పగించే ముందు కొన్ని లీగల్ కార్యక్రమాలు, ఇమ్రిగ్రేషన్ ను అధికారులు పూర్తిచేస్తున్నారు.
ప్రస్తుతం రావల్పిండిలో ఉన్న అభినందన్ ను పాకిస్తాన్ ఆర్మీ విమానంలో లాహోర్ కు తరలించింది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వాఘా సరిహద్దుకు పాక్ ఆర్మీ తీసుకొస్తుందని అధికారులు చెబుతున్నారు. వాఘ సరిహద్దు వద్దకు అభినందన్ చేరుకోగా.. ఆయనకు మొదట భారత వైద్య బృందం వైద్యపరీక్షలు చేయనుంది. అభినందన్ శరీరంలో పాక్ ఆర్మీ ఏమైనా రసాయనాలు.. సీక్రెట్ చిప్ప్ ఏమైనా ప్రవేశపెట్టిందా అనే కోణంలో ఈ పరీక్షలు చేయనున్నారు..
అభినందన్ ఆరోగ్య పరిస్గితి ఎలా ఉందో ఈ పరీక్షల్లో భారత్ వైద్యాధికారులు తేల్చనున్నారు. అదే సమయంలో పాక్ ఆర్మీ చేతికి చిక్కిన సమయంలో వారు ఏం అడిగారు.. ఏం చేశారనే విషయాన్ని అభినందన్ నుంచి భారత రక్షణ శాఖాధికారులు స్టేట్ మెంట్ రికార్డు చేస్తారు. ఈ స్టేట్ మెంట్ తర్వాత అభినందన్ ను కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తారని సమాచారం.
ప్రస్తుతం అభినందన్ తల్లిదండ్రులు, బంధువులు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్ కుటుంబ సభ్యులను మీడియా కంట పడకుండా ఆర్మీ ప్రత్యేకంగా ఉంచింది.
ఇక వాఘా సరిహద్దుకు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో సైనిక వందనాలు, విన్యాసాలు రీట్రీట్ నిర్వహించడాన్ని రద్దు చేశారు. అభినందన్ రాక లేట్ కావడం... పెద్ద ఎత్తున జనం రావడంతో ఆర్మీ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.