Begin typing your search above and press return to search.
ఆ ఎటీఎంలో వంద నోట్లకు బదులుగా రూ.500 నోట్లు ఎలా?
By: Tupaki Desk | 16 May 2021 5:06 AM GMTవంద రూపాయిల నోటు రావాల్సిన స్థానే రూ.500 నోట్లు వస్తుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారా? ఏటీఎంలో పొరపాటుగా వందకు బదులుగా రూ.500 నోట్లు వస్తున్న వైనం కలకలాన్ని రేపింది. దీంతో.. అవసరం ఉన్నా లేకున్నా ఏటీఎం వద్ద బారులు తీరటమే కాదు.. ఎడాపెడా డ్రా చేసేసిన వైనం వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకూ.. వంద నోట్లకు బదులుగా రూ.500 నోట్లు ఎలా వచ్చాయన్న విషయంలోకి వెళితే..
వనపర్తి జిల్లాలోని అమరచింతలోని ఇండియా వన్ ఏటీఎం కేంద్రం ఉంది. ఒక వ్యక్తి డబ్బులు డ్రా చేయటానికి అందులోకి వెళ్లటం.. రూ.100కు బదులుగా రూ.500 నోట్లు రావటం మొదలైంది. దీంతో.. రూ.4వేలు డ్రా చేసుకోవాల్సిన సదరు వినియోగదారుడికి ఏకంగా రూ.20వేలు చేతికి అందాయి. ఈ విషయం తెలిసినంతనే మిగిలిన వారంతా సదరు ఏటీఎం వద్దకు పోటెత్తారు.
దీంతో.. ఈ ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న అధికారులు ఏటీఎం కేంద్రానికి వచ్చి దానికి తాళం వేసేశారు. ఇంతకీ రూ.100 నోటుకు బదులుగా రూ.500 నోటు ఎందుకు వస్తుందన్న విషయాన్ని చెక్ చేయగా.. డబ్బుల్ని లోడ్ చేసే వేళలో.. రూ.100 నోట్ల కట్టల స్థానే రూ.500 నోట్లు పెట్టేయటంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. దీంతో.. ఈ లోపాన్ని గుర్తించిన సిబ్బంది ట్రేను మార్చేశారు. డబ్బులు అదనంగా డ్రా చేసుకున్న వారు.. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇవ్వాలని కోరుతున్నారు. లేకుంటే పోలీసులకు కంప్లైంట్ చేసి రికవరీ చేస్తామని చెబుతున్నారు.