Begin typing your search above and press return to search.
కరోనాతో అమెరికాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే?
By: Tupaki Desk | 21 March 2020 5:10 AM GMTమీరు హాలీవుడ్ సినిమాలు పెద్దగా చూడకపోయినా.. గుర్తుకు వచ్చిన యాక్షన్ మూవీల్ని.. వాటి కాన్సెప్టుల్ని గుర్తు చేసుకోవటం. ఒక భారీ సమస్య అమెరికాలోని మహా నగరాల మీద పడుతుంది. అంతే అతలాకుతలమవుతుంది. అలాంటి వేళ.. ఓపక్క భారీ డ్యామేజ్ జరిగినా.. హీరో రంగంలోకి దిగి.. ఆ సమస్యను ఒంటిచేత్తో పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా చోటు చేసుకునే నష్టం దిమ్మ తిరిగేలా ఉంటుంది. గ్రాఫిక్స్ మాయాజాలంతో అంత భారీ నష్టాన్ని చూపించే హాలీవుడ్ మూవీ ల్లో సైతం కనిపించని సీన్లు.. ఇప్పుడు అమెరికాలోని పలు మహానగరాల్లో చోటు చేసుకున్నాయని చెప్పాలి.
ఇప్పుడు అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలు 11,500 మంది. దీంతో.. అమెరికాలోని సగం రాష్ట్రా ల్లోని ప్రజల్ని ఇళ్లల్లోనే ఉంచేవారు. ఇంట్లో నుంచి బయటకు రావొద్దంటూ కఠినమైన నిబంధనల్ని జారీ చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటి సిలికాన్ వ్యాలీ మొత్తంగా మూతపడటం గమనార్హం. కొన్ని వ్యాపారసంస్థలు తెరిచి ఉంచినా.. అక్కడ నిత్యవసర వస్తువులు ఏమీ లభించటం లేదు. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం లో విధుల్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడి వందలాది కంపెనీల్లోని ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడిలానే ఉంది.
సిలికాన్ వ్యాలీ (కాలి ఫోర్నియా)తో పాటు వాణిజ్య కేంద్రంగా చెప్పే న్యూయార్క్ నగరం సైతం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ మహానగరానికి పొరుగునే ఉన్న న్యూజెర్సీ.. కనెక్టికట్ రాష్ట్రాల్లోని ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేశారు. ఇలాంటి పరిస్థితే వాషింగ్టన్.. ఫ్లోరిడా.. ఇల్లినాయి.. షికాగో.. లూసియానా.. జార్జియా.. టెక్సాక్ లాంటి రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరిగిపోవటంతో ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అమెరికాలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల్లో న్యూయార్క్ ముందుంది. ఆ రాష్ట్రంలో ఏకంగా 4,152 మంది పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వాషింగ్టన్ లో 1228 కేసులు.. కాలిఫోర్నియాలో 1044.. న్యూజెర్సీలో742 కేసులు నమోదయ్యాయి. వంద కంటే ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాలుగా విస్కాన్సిన్.. సెన్సిల్వేనియా.. టెక్సాక్.. కొలరాడొ.. మసాచ్యూసెట్స్.. లూసియానా.. ఇల్లినాయి.. జార్జియా.. ఫ్లోరిడాలు ఉన్నాయి.
తెలుగువారు లక్షల సంఖ్యలో ఉండే రాష్ట్రాలైన కాలిఫోర్నియా.. టెక్సాస్.. న్యూజెర్సీల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటం.. వీధుల్లోకి ప్రజలు రావొద్దన్న కఠిన ఆదేశాలు ఉండటంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతుున్నారు. నిత్యవసర వస్తువుల కోసం బారులు తీరాల్సిన పరిస్థితి. భారతీయులు ఆదారపడే దుకాణాలు మూసి ఉండటంతో వేలాది మంది ఇబ్బందికి గురి అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్యవసర వస్తువులు లేని తెలుగు కుటుంబాలకు.. ఇతర తెలుగు కుటుంబాలు అసరాగా నిలిచి.. వస్తువుల్ని అందిస్తున్నాయి. తెలుగు వారిని ఆదుకునేందుకు.. వారికి అవసరమైన నిత్యవసర వస్తువుల్ని అందేలా చేయటం కోసం షాపులు తెరిపించాల్సిందిగా అక్కడి అధికారుల్ని తెలుగు సంఘాలు కోరుతున్నాయి.
అమెరికాలో ఉన్న తెలుగువారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని.. ఇళ్లకే పరిమితం కావాలంటూ వినతులు పెరుగుతున్నాయి. నిత్యవసర వస్తువుల కోసం బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న సూచనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. పెద్ద వయస్కు లైన భారతీయులు బయటకు రావొద్దనిభారతీయ సంఘాలు కోరుతున్నాయి.