Begin typing your search above and press return to search.
కొడుకు లవ్ ను బ్రేక్ చేసేందుకు ఆ తండ్రి ఎంత నీచమైన ప్లాన్ వేశాడంటే?
By: Tupaki Desk | 1 Feb 2020 4:19 AM GMTకొడుకు ప్రేమను దెబ్బ తీసేందుకు ఏ తండ్రి వేయలేని ఒక నీచమైన ప్లాన్ చేసిన తండ్రి వైనం తమిళనాడులో వెలుగు చూసింది. విన్నంతనే నోటి వెంట మాట రాకుండా చేసిన ఈ దుర్మార్గమైన ప్లాన్ వింటే ఒళ్లు జలదరించాల్సిందే. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.
జిల్లాకు చెందిన ముకేశ్ కన్నన్ అనే యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. వారిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. తమ ఇళ్లల్లో వారి ప్రేమను తెలియజేశారు. ఇరు కుటుంబాల వారు వారి ప్రేమకు నో చెప్పారు. ఇలాంటివేళ.. తన కొడుకు సదరు అమ్మాయితో ప్రేమలో ఉండటాన్ని జీర్ణించుకోలేని కన్నన్ తండ్రి నిత్యానందం దారుణమైన ప్లాన్ వేశాడు.
అమ్మాయి ఇంటికి వెళ్లి.. తన కొడుకుతో పెళ్లి చేస్తానని ఆ అమ్మాయిని నమ్మించాడు. కారులో తీసుకొస్తూ మార్గ మధ్యంలో ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అంతేకాదు.. తాళి కూడా కట్టేశాడు. తన స్నేహితుడి ఇంట్లో ఆమెను బంధించి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన కొడుకును మర్చిపోవాలని.. తనతోనే కాపురం చేయాలంటూ ఆమెను బలవంతం పెట్టసాగాడు. తన మాట వినకుంటే చంపేస్తానని బెదిరించేవాడు.
అదే సమయంలో తన కొడుక్కి మాత్రం.. సదరు అమ్మాయి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుంటుందని.. ఆ అమ్మాయిని మర్చిపోవాలంటూ హితబోధ చేసేవాడు. ఇదిలా ఉంటే.. అతడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు వేదారణ్యం పోలీసుల వద్దకు వెళ్లి.. తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయటంతో.. పోలీసులు సైతం షాక్ తిన్నారట. ప్రస్తుతం నిత్యానందం కోసం పోలీసులు వెతుకుతున్నారు.తనకు ఇష్టం లేకుండా ఎంత ప్రేమిస్తే మాత్రం.. మరింత ఇంత నీచానికి పాల్పడతారా? అన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వస్తోంది.