Begin typing your search above and press return to search.
సండే సందడికి ట్యాంక్ బండ్ ను ఎంత సుందరంగా మార్చేశారో తెలుసా?
By: Tupaki Desk | 12 Sep 2021 9:44 AM GMTసామాన్యుడు ఏం చేయగలడు? అన్న ప్రశ్న నిరాశతో వినిపిస్తూ ఉంటుంది. నిజమే.. సామాన్యుడు ఏమీ చేయలేడనే అనుకుంటాం. కానీ.. స్పందించే సర్కారు ఉంటే అన్ని సాధ్యమే అన్న విషయం తాజాగా మరోసారి ఫ్రూవ్ అయ్యింది. సండే రోజున ట్యాంక్ బండ్ మీద సాయంకాలాలు ట్రాఫిక్ మొత్తాన్ని వేరే మార్గం నుంచి మళ్లించేసి.. ట్యాంక్ బండ్ మీద కుటుంబాలతో కాలక్షేపం చేసేలా మార్పు చేయాలని ఒక నెటిజన్ పేర్కొనటం.. అందుకు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి.. చర్యలు తీసుకోవాలని చెప్పటం తెలిసిందే.
రాజు తలుచుకుంటే వరాలకు కొదవా అన్నట్లు.. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. ట్యాంక్ బండ్ ను సండే ఫన్ డేగా మార్చేందుకు వీలుగా యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. వారాంతంలో సాయంత్రాలు ఆహ్లాదకరమైన ప్రాంతానికి వెళ్లే అలవాటునగర జీవులకు ఎక్కువన్న విషయం తెలిసిందే. ట్యాంక్ బండ్ ను అలాంటి ప్రాంతంగా మార్చాలన్నది మంత్రిగారి వ్యూహం. దీనికి తగ్గట్లే అధికారులు ఏర్పాట్లను యుద్ధ ప్రాతపదికన పూర్తిచేస్తున్నారు.
న్యూయార్కు నగరానికి లిబర్టీ ఐల్యాండ్ మాదిరి.. లండన్ నగరానికి ట్రాఫాల్ గర్ స్కేర్ మాదిరి హైదరాబాద్ కు ట్యాంక్ బండ్ ఒక మణిహారమని.. అలాంటి దాన్ని అత్యాధునిక హంగులతో తీర్చి దిద్దాలన్నదే కేసీఆర్ సర్కారు ఆలోచనగా చెబుతన్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ సుందరీకరణ కోసం హెచ్ఎండీఏ రూ.27 కోట్ల నిధుల్ని ఖర్చు చేసింది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి అయినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ట్యాంక్ బండ్ మీద వీకెండ్ వేళ.. సరికొత్త అనుభూతిని ప్రజలకు కలిగేలా చేయటం కోసం కేటీఆర్ అండ్ కో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పాలి.
ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్యాంక్ బండ్ మీద ట్రాపిక్ ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. ఈ సమయంలో ట్యాంక్ బండ్ మీద వాహనాల్ని అనుమతించరు. దీంతో.. పిల్లా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రూ.27 కోట్లను ఖర్చు చేస్తున్నారు. కళలు.. హస్తకళలకు సంబంధించిన స్టాల్స్ తో పాటు సంగీత కార్యక్రమాల్నినిర్వహించనున్నారు. అంతేకాదు.. హైదరాబాద్ రుచుల్ని చూసేందుకు ప్రత్యేకంగా ఫుడ్ ట్రక్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ లో భాగంగా ట్యాంక్ బండ్ కు ఇరువైపులా ఉన్న ఫుట్ పాత్ లను పూర్తిగా తొలగించి.. వాటిని ఆధునీకరించారు. విశాలంగా ఉన్న ట్యాంక్ బండ్ మీద గ్రానైట్ రాళ్లను ఫుట్ పాత్ లను తీర్చి దిద్దారు. ట్యాంక్ బండ్ ప్రాంతం గట్టిగా ఉండేందుకు వీలుగా క్రషర్ సౌండ్ తో పీసీసీ.. స్లాబ్ రీఇన్‌ఫోర్స్‌మెంట్ చేశారు. మొత్తంగా ట్యాంక్ బండ్ రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పక తప్పదు.