Begin typing your search above and press return to search.
ఓర్నీ.. బ్లాక్ ని వైట్ చేయటానికి ఎన్ని ఐడియాల్రా
By: Tupaki Desk | 11 Nov 2016 5:30 PM GMTపెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. మోడీ నిర్ణయంతో బ్లాక్ కుబేరులకు చెక్ పెట్టినట్లేనని.. కేంద్రం ప్రకటించిన విధానాలు.. నిబంధనలతో వారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావటం ఖాయమన్న మాట చాలామంది నోట వినిపించింది. ఎంత పెద్ద షాక్ అయినా దాని ప్రభావం కొంతసేపే. ఆ తర్వాత మైండ్ పని చేయటమే కాదు.. తనకు తగిలిన షాక్ నుంచి ఎలా బయటపడాలా? అన్న ఆలోచన చేయటం మామూలే. ఇప్పుడు నల్ల కుబేరుల యవ్వారం చూస్తే ఇదెంత నిజమో ఇట్టే తెలిసిపోతుంది. పెద్దనోట్ల రద్దుపై మోడీ నిర్ణయం అనంతరం ఒక పూట పాటు ఏమీ పాలుపోనట్లుగా వ్యవహరించిన బడాబాబులు.. తమ సన్నిహితులతో కూర్చొని వేసిన మాస్టర్ ప్లాన్లు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన రాజకీయ నేతలు.. పారిశ్రామికవేత్తలు.. వ్యాపార సంస్థల అధిపతులు. కంపెనీలకు చెందిన వారు వేసిన ఎత్తుల్ని బయటపెట్టాలని ‘‘తుపాకీ’’ నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ఈ వర్గాల వారు ఏమేం చేస్తున్నారన్న విషయంపై నిఘా నేత్రం వేసింది. ఈ సందర్భంగా వారు వేసిన ఎన్నో ఎత్తులు బయటకు వచ్చాయి. వాటిని వరుసగా చెప్పుకుంటూ వస్తే..
ఉద్యోగులతో..
నాలుగు రోజులు ఆగితే నల్లధనం కాస్తా చిత్తుకాగితాలు కానున్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తలైన కొందరు రాజకీయ నేతలు తమ దగ్గరున్న ఉద్యోగులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు. వారికి రూ.3.. 4 లక్షల చొప్పున డబ్బులు ఇచ్చేస్తామని.. రూ.1.5లక్ష ఉంచేసుకొని మిగిలిన మొత్తాన్ని వాయిదాల రూపంలో తిరిగి ఇచ్చేయాలని.. వాటిని బ్యాంకుల్లో వేసుకోవాలని కోరుతున్నారు. భార్యభర్తల ఇద్దరి అకౌంట్లకు అడ్జెస్ట్ అయ్యేలా వారు సొమ్ములు ఆఫర్ చేస్తున్నారు. అదే సమయంలో వారి చేత ప్రామసరీ నోట్లు రాయించుకోవటం.. చెక్కులు తీసుకోవటం చేస్తున్నారు.
తిరిగి ఇచ్చేస్తున్నారు..
ఇప్పటివరకూ కొన్ని సంస్థలకు తాము పడిన బాకీల్ని మూటలు కట్టి మరీ తిరిగి ఇచ్చేస్తున్నారు. అంతేకాదు.. వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయటమే కాదు.. కొంత మొత్తాన్ని అదనంగా ఇచ్చేసి.. వీలైనంత వరకూ అడ్జెస్ట్ చేయమని.. దానికి ఎంతోకొంత కమిషన్ గా తీసుకొమ్మని పెద్ద మనసుతో ఆఫర్ ఇచ్చేస్తున్నారు.
అడ్వాన్స్ లే అడ్వాన్స్ లు..
కొన్ని వ్యాపార సంస్థలకు సరకు ఇచ్చిన తర్వాత.. సేవలు అందించిన తర్వాత నెలల తరబడి బిల్లులు ఇవ్వని పెద్ద మనుషులు.. ఇప్పుడు మాత్రం ఉదారంగా వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయటమే కాదు.. రానున్న ఆర్నెల్లు.. ఏడాది వరకూ వారు సేవలు అందించేందుకు అవసరమైన మొత్తాన్ని కూడా పాత పెద్ద నోట్లతో అడ్జెస్ట్ చేసుకోవాలని కోరుతున్నారు.
పనోళ్లు కాస్తా నమ్మకస్తులయ్యారు
నిన్నటి వరకూ పనోళ్లను పని చేయించుకోవటానికి మాత్రమే ఉపయోగించే బడాబాబులు.. ఇప్పుడు వారికి అవసరమైన అప్పులుకూడా ఇస్తామని చెప్పటమే కాదు.. వారి బంధువులను కూడా తీసుకురావాలని చెబుతూ లక్షల రూపాయిలు నోట్లు రాయించుకొని ఇచ్చేస్తున్నారు. మరికొందరైతే రూ.2లక్షలు ఇస్తాం.. బ్యాంకుల్లో వేసి లక్ష నుంచి లక్షన్నర వరకూ తిరిగి ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
బ్యాంకు అధికారులతో కూడా..
మరికొంత మంది ముదుర్లు అయితే మరో అడుగు ముందుకు వేస్తున్నారు. పెద్దనోట్లను మార్చుకోవటానికి బ్యాంకులకు వస్తున్న వారు రూ.4వేల మొత్తం కంటే తక్కువ మొత్తాన్ని కోరితే.. అలాంటి వాటిని గుర్తించి.. ఎంత తేడా ఉందో అంత మొత్తాన్ని వారిఖాతాలోకిరాసేసి.. ఆ మొత్తాన్ని వైట్ చేసేస్తున్నారు. ఈ సేవ చేసినందుకు బ్యాంకు అధికారులు కొందరికి భారీగా వాటా ఇచ్చేస్తున్నారు.
పిల్లలే ఇప్పుడు ‘బ్యాంకులు’
ఇక.. చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పే యాజమాన్యాలకు చెందిన బడా బాబులు.. తమ దగ్గరి విద్యార్థుల్లో మంచి పేరున్న పేరెంట్స్ (ఆర్థికంగా వెనుకబడిన వారిని ఎంపిక చేసుకొని) పిలిపించి తమ దగ్గరి నలుపును తెలుపు చేసి పెట్టాలని.. ఇందుకు ఫీజు తగ్గింపు ఆఫర్ ఆశ చూపిస్తున్నారట.
సేవా సంస్థల్ని వదలట్లేదు..
సేవా సంస్థలకు విరాళాల రూపంలో తమ దగ్గరి నలుపును ఇచ్చేస్తున్న కుబేరులు.. వారికి తాముచేస్తున్న సాయానికి ప్రతిఫలంగా తమ దగ్గరి మొత్తాన్ని కొంత తెలుపు చేసి సాయం చేయాలని కోరుతున్నారట
ముదురు సీఏలను కూర్చొబెట్టుకొని..
ఈ యవ్వారం మరింత చిత్రమైనది. ఖాయిలా పడిన పరిశ్రమల్ని తమకు అనుకూలంగా మార్చేసుకొని.. వారికి నిధులు ఇచ్చినట్లుగా బిల్లులు తయారుచేయించి.. వారికి డబ్బులు చెల్లించేసి.. వారికి ఇవ్వాల్సిన వాటాను అప్ప చెప్పేసి తెలుపు చేసుకుంటున్నారు
బంగారంతోనూ..
మరికొందరైతే బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తూ.. మార్కెట్లో ఉన్న ధరకు రెట్టింపు అయినా ఫర్లేదంటూ బేరానికి వచ్చేస్తున్నారట. ఇప్పటివరకూ అందిన సమచారం ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారాన్ని రూ.50వేల వరకూ కొనేందుకు వెనుకాడటం లేదట.
స్నేహితుడు స్నేహితుడూ ‘హితుడే’
ప్రెండ్.. ఫ్రెండ్ కూడా ఫ్రెండే అన్న సూత్రం ఇప్పుడు బాగా అక్కరకు వస్తోంది. కొందరు బడాబాబులకు నమ్మకస్తులతో పాటు.. వారికి మంచి దోస్త్ లకు కూడా తమ దగ్గరున్న మొత్తాన్ని ఇచ్చేసి.. వాటిని మార్చి ఇచ్చేసిన దానికి ‘బదులు’ చెల్లించేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/