Begin typing your search above and press return to search.
అలాంటి వారి రక్తంతో కరోనా వైరస్ పై ఎటాక్..?
By: Tupaki Desk | 27 March 2020 7:10 AM GMTప్రాణాలు ప్రమాదంలో చిక్కుకున్న వేళ.. ఆ ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదలుకోరు. అలాంటిది.. కోట్లాది మందిని కాపాడుకోవటానికి మరెన్ని ప్రయత్నాలు చేయాలి? ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొని ఉంది. అంతకంతకూ తీవ్రమవుతున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వీలుగా.. వైద్య శాస్త్రంలో అవకాశం ఉన్న అన్ని చికిత్సా విధానాల్ని వైద్యులు పాటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అప్పుడెప్పుడో అమలు చేసిన పురాతన చికిత్సా విధానాన్ని ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారు.
అంటువ్యాధులు విరుచుకుపడినప్పుడు సక్సెస్ ఫుల్ గా అమలైన పురాతన వైద్య చికిత్సా విధానాన్ని కరోనా విషయంలోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. ఇంతకీ ఆ విధానం ఏమిటి? ఎందుకు అమలు చేయాలని భావిస్తున్నారు? అన్న విషయాల్లోకి వెళితే..
గతంలో ఫ్లూ.. తట్టు వ్యాధులు విరుచుకుపడిన వేళ.. వ్యాక్సిన్ కంటే ముందుగా చికిత్సను కనుగొన్న సంగతి తెలిసిందే. సార్స్.. ఎబోలాకు చికిత్స చేసినట్లుగా.. కరోనాకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కరోనాను జాయించిన వారి రక్తాన్ని తీసుకొని.. అందులోని ప్లాస్మా ద్వారా కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స చేయాలని భావిస్తున్నారు. ఈ విధానంలో ప్రత్యేక రోగ క్రిముల బారిన పడిన వ్యక్తి శరీరం.. వైరస్ పై పోరాడేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాంటీబాడీలుగా పిలిచే ప్రోటీన్లను తయారు చేయటం షురూ చేస్తుందని చెబుతున్నారు. ఇలా డిజైన్ చేసుకున్నవి నెలల తరబడి వారి రక్తంలోనే ఉంటాయి.
ఈ సానుకూల అంశాన్ని కరోనా మీద పోరాడేందుకు వాడుకోవాలని భావిస్తున్నారు. కరోనాను అధిగమించిన వారి రక్తాన్ని సేకరించి.. దాని బారిన వారి రక్తంలోకి ఎక్కించటం ద్వారా పిశాచి వైరస్ పై ఎటాక్ చేసేందుకు సాయం చేయటంతోపాటు.. రోగనిరోధక శక్తి మరింత పెరిగే వీలుందని భావిస్తున్నారు. అయితే.. ప్లాస్మా ఎక్కించే విధానంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఊపిరితిత్తులకు నష్టం కలిగే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. అయితే.. నష్టంతో పోలిస్తే.. లాభమే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఈ విధానాన్ని అమలు చేసే దిశగా అమెరికాతో సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.