Begin typing your search above and press return to search.
ట్విట్టర్ పై భారత ప్రభుత్వం సీరియస్
By: Tupaki Desk | 7 Nov 2022 2:05 PM GMTట్విటర్ ఎప్పుడైతే ప్రపంచంలోనే కుబేరుడు ఎలన్ మస్క్ చేతుల్లో పడిందో అప్పటి నుంచే దానిలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఈవో, సీఎఫ్ఓ సహా చాలా మందిని తొలగించిన ఎలన్ మస్క్ ఇప్పుడు కంపెనీలోని 50శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు.
ట్విట్టర్ కొత్త యజమాని అయిన ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో సమూల మార్పులను తీసుకువస్తున్నారు. ట్విట్టర్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులను భారీగా తగ్గిస్తూ తాజాగా నిర్ణయించారు. ట్విటర్ సంస్థలోని ఉద్యోగులలో 50 శాతం మందిని తొలగించడంపై భారత ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ట్విటర్ మేనేజ్‌మెంట్‌ను తప్పుపట్టారు.
“భారతదేశంలో తొలగింపు ప్రక్రియను ట్విటర్ నిర్వహించిన విధానాన్ని మేము ఖండిస్తున్నాము. తక్షణమే ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన సరికాదన్నారు. కొత్త ఉద్యోగాల కోసం వెతకడానికి ఉద్యోగులకు తగినంత సమయం ఇవ్వాలి” అని ఐటీ మంత్రి వ్యాఖ్యానించారు.
ట్విట్టర్ భారతదేశంలో తన ఉద్యోగులను భారీగా తగ్గించుకుంది. భారతదేశంలోని మొత్తం 230 మంది ఉద్యోగులలో 180 మందిని తొలగిస్తూ ఈమెయిల్ చేసినట్టు తెలిసింది. భారతదేశంలో ట్విట్టర్ కార్యకలాపాలలో కొన్ని విభాగాలు ఇప్పుడు ఉద్యోగులతో లేవు. ట్విట్టర్ గ్లోబల్ ఉద్యోగులు 8000 మందిలో దాదాపు 50% మందికి ఇప్పుడు పింక్ స్లిప్ అందుకొని ఉద్యోగాలు కోల్పోయారు. భారత్ లో ఉద్యోగుల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వం ఈ మేరకు ట్విటర్ పై సీరియస్ అయ్యింది.
ఎలన్ మస్క్ ఇప్పుడు ట్విటర్ లోని 50శాతం మంది ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. అంత మంది ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తున్న ఎలన్ మస్క్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 50 శాతం మంది సిబ్బందిని తొలగించామని, కంటెంట్ నియంత్రణపై భరోసా ఇవ్వడానికే ఇలా చేస్తున్నామని ట్విట్టర్ పేర్కొంది.
అయితే సగం మందిని తొలగించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యొక్క కంటెంట్ మోడరేషన్ సామర్థ్యాలు అలాగే ఉన్నాయని దిగజారవని శుక్రవారం ఒక ట్వీట్‌లో తెలిపారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ కంపెనీని స్వాధీనం చేసుకున్న తర్వాత భద్రత -సమగ్రత హెడ్ యోయెల్ రోత్ చేసిన ట్వీట్ వినియోగదారులకు, ప్రకటనదారులకు భరోసా ఇవ్వడానికే చేసిందని అంటున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.