Begin typing your search above and press return to search.
ఇప్పుడిలా మాట్లాడతారా గవర్నర్ జీ?
By: Tupaki Desk | 14 Dec 2019 6:59 AM GMTరాజ్యాంగ పదవుల్లో ఉండేవారు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. తొందరపడి పెదవి విప్పటానికి కూడా ఇష్టపడరు. అలాంటిది.. అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో కొందరు వ్యవహరిస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు కారణంగా దేశంలో రగులుతున్న నిరసనలు తెలిసిందే. ఇలాంటివేళ.. మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.
పౌరసత్వ సవరణ బిల్లు ఈశాన్య రాష్ట్రాలు ఎంతలా రగిలిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇలాంటివేళలో ఆయన చేసిన ట్వీట్ కాలిపోయేలా మారింది. పౌరసత్వ సవరణ చట్టం నచ్చని వాళ్లు నార్త్ కొరియాకు వెళ్లిపోవచ్చంటూ ట్వీట్ చేశారు.
రెండు వాస్తవాలను వివాదాస్పదంగా ఎప్పుడు చూడకూడదన్న ఆయన.. మొదటిది దేశ విభజన మతం కారణంగా జరిగిందని.. విభజిత ప్రజాస్వామ్యం ఈ దేశానికి అవసరం.. ఈ రెండింటిపై ఎవరైనా విభేదిస్తే వారు నిరభ్యంతరం నార్త్ కొరియాకు వెళ్లిపోవచ్చని ట్వీట్ చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన నిరసనకారులు రాజ్ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు.
వారిని భద్రతా దళాలు కష్టమ్మీద నిలువరించాయి. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. అనంతరం టియర్ గ్యాస్ వినియోగించారు. గుంపును చెదరగొట్టే ప్రయత్నంలో నిరసనకారులతో పాటు పలువురుపోలీసులకు గాయాలయ్యాయి.