Begin typing your search above and press return to search.

ఎవరీ గబ్బిలం మహిళ.. ఆమె ప్రత్యేకత ఏమిటి?

By:  Tupaki Desk   |   16 March 2020 1:30 AM GMT
ఎవరీ గబ్బిలం మహిళ.. ఆమె ప్రత్యేకత ఏమిటి?
X
గబ్బిలం అన్నంతనే భారతీయులు ఉలిక్కిపడతారు. అది ఎదురైతేనే అపశకునంలా భావిస్తారు. అదొచ్చి ఇంటి మీద వాలితే కంగారు పడిపోతారు. అలాంటిది ఒక మహిళను గబ్బిలాల మహిళ అన్న పేరుతో పిలుస్తున్న వైనం వింటేనే.. ఆమె సమ్ థింగ్ స్పెషల్ అన్న భావన కలగటం ఖాయం. నిజమే.. ఆమె మిగిలిన వారికి భిన్నం. కోట్లాది మందిలో ఒకరిద్దరు కూడా ఆమెలా ఉండరు. ఆమె పేరే.. షి-జెంగ్లీ. గబ్బిలాల మీద లోతుగా పరిశోధనలు.. అధ్యయనాలు చేసిన హిస్టరీ ఆమె సొంతం.

ఏళ్లకు ఏళ్లు గబ్బిలాల గుహల్లో కరోనా జాతి వైరస్ మీద ఆమె చేసిన పరిశోధనలు అన్ని ఇన్ని కావు. ఆమె రీసెర్చ్ పేపర్లు ప్రముఖ సైన్స్ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. గత డిసెంబరులో చైనాలోని వూహాన్ మహానగరంలో కరోనాను గుర్తించినంతనే చైనా ప్రభుత్వం తొలుత సంప్రదించింది షి-జెంగ్లీనే. డిసెంబరు 30 రోజును ఆమె చప్పున గుర్తుకు తెచ్చుకుంటారు.

వూహాన్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఆమె.. షాంఘైలో జరుగుతున్న సదస్సుకు హాజరై ప్రసంగిస్తున్నారు. ఆమె అప్పుడు మాట్లాడుతున్న అంశం కూడా.. గబ్బిలాల ద్వారా వచ్చే వైరస్ ల గురించే. వూహాన్ లోని ఉన్నతాధికారి నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో ఆమె హుటాహుటిన బయలుదేరారు. ఆసుపత్రిలో వింత జ్వరం.. అసాధారణ నిమోనియాతో బాధ పడుతున్న రోగిని చూసి ఆమె సందేహపడ్డారు. ఆమె అనుమానమే నిజమైంది. ఆ వెంటనే.. నాన్ వెజ్ వినియోగాన్ని నిషేదించాలని చైనా ప్రభుత్వానికి సూచన చేయటం.. వెంటనే దానికి సంబంధించిన ఉత్తర్వును విడుదల చేశారు. ఆమె మాటకు చైనా ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్నది ఇట్టే అర్థమైపోతుంది.

2002-03లలో విరుచుకుపడిన సార్స్ వైరస్ ను గుర్తించి.. దాని గురించి హెచ్చరికలు మొదలు పెట్టింది కూడా ఈమే. సార్స్.. ఎబోలా లాంటి వాటికి కారణం గబ్బిలాలు అన్నది గుర్తించి.. అందరికి చెప్పింది కూడా ఆమే. ఇలా గబ్బిలాలు.. వాటికి సంబంధించిన వైరస్ లను గుర్తించటంలో ఈ గబ్బిలాల మహిళకు మించినోళ్లు మరెవరూ లేరనే చెప్పాలి.