Begin typing your search above and press return to search.
లంగ్స్ పై కరోనా డెడ్లీ ఎటాక్...ఎలా అంటే
By: Tupaki Desk | 24 March 2020 3:30 AM GMTకరోనా మహమ్మారి బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణ జలుబు - జ్వరంతో మొదలయ్యే ఈ మహమ్మారి లక్షణాలు...క్రమేణా భయంకరమైన న్యుమోనియాలా మారి ప్రాణాలను హరిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే కోవిడ్- 19 వల్ల శ్వాస తీసుకోవడంలో రోగి తీవ్ర ఇబ్బందులకు గురై మరణిస్తాడు. సాధారణంగా కరోనా సోకిన మూడు నుంచి నాలుగు రోజుల మధ్య ఈ వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. తొమ్మిది రోజులు గడిచేసరికి ఊపిరి అందడం చాలా కష్టమవుతుంది. కొందరిలో అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా రావడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురై ప్రాణాలు కోల్పోతారు. కరోనా ఊపిరితిత్తులమీద దాడి చేసి...రోగిని ముప్పుతిప్పలు పెట్టి ప్రాణాలను హరిస్తుంది.
సాధారణంగా న్యుమోనియా - ఫ్లూ వంటి లక్షణాలు ఉన్నపుడు శ్వాస తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది. కానీ, కోవిడ్ 19...మిగతా వాటికన్నా భిన్నంగా నేరుగా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శ్వాసకోశ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే కోవిడ్ -19...ఊపిరితిత్తుల పనితీరుపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. ముందుగా ఊపిరితిత్తులకు సంక్రమించిన వైరస్...ఆ తర్వాత ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి చేరుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ప్రాణాంతకమైన సెప్సిస్ (బ్లడ్ ఇన్ ఫెక్షన్) ఒక వారం తర్వాత మొదలవుతుంది. ఆ సమయంలో ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బందులతోపాటు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఆ సమయంలో రోగిని కాపాడుకోవడానికి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటె న్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి వారికి చికిత్స అందించాలి. అప్పటికీ రోగి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే కాపాడుకోవడం కష్టం. వీరిలో రోగ నిరోధక శక్తి బాగుండి - ఇతర జబ్బులు లేకుంటే - కరోనాను సులువుగా జయించవచ్చు. అతా కాకుండా - బీపీ - షుగర్ - గుండె జబ్బులు - శ్వాసకోస సమస్యలు - తదితర జబ్బులున్నా...60 ఏళ్లు దాటినా...వారిపాలిట కరోనా పెనుముప్పుగా మారుతుంది.