Begin typing your search above and press return to search.

గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందట!

By:  Tupaki Desk   |   6 July 2020 2:40 PM IST
గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందట!
X
చైనాలోని వుహాన్ లో గత ఏడాది డిసెంబర్ లో వెలుగుచూసిన ఈ వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య కోటి దాటగా.. మృతుల సంఖ్య లక్షల్లో ఉంది. రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఈ వైరస్ గురించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో వణుకు పుట్టించే కొత్త విషయాలు తెలుస్తున్నా

ఈ వైరస్ గాలిలో ఎగురుతూ వ్యాధి వ్యాప్తికి కారణం అవుతున్నాయి అనే వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి నుంచి ఖండిస్తోంది. వ్యక్తి ముక్కు, నోటి నుంచి వచ్చే తుంపర్లలో మాత్రమే వైరస్ ఉంటుందనీ... ఆ తుంపర్లు మాగ్జిమం 13 అడుగుల వరకూ వెళ్తాయని WHO అంటోంది. కానీ ప్రపంచంలోని 239 మంది ప్రముఖ నిపుణులు మాత్రం ఈ వైరస్ గాలిలో కూడా ఉంటుందని, గాలి ద్వారా కూడా సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు.

దీనిపై WHO మరింత లోతుగా పరిశోధన చెయ్యాలని కోరుతున్నారు. వాళ్లు చెబుతున్నట్లే ప్రపంచవ్యాప్తంగా బార్లు, హోటళ్లు, షాపులు, మార్కెట్లు, ఆఫీసులు, క్యాసినోలు... ఇలా అన్ని చోట్లా కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. గాలిలో ఎగురుతూ ఉండే వైరస్ దానికి దగ్గరగా ఉండే వారికి వ్యాపిస్తోందని నిపుణులు వాదిస్తున్నారు.

గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున సూచనలు, సిఫార్సులను సవరించాలని కోరుతూ శాస్త్రవేత్తలు లేఖ రాశారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. గాలి ద్వారా కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనేందుకు ఆధారాలున్నాయని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్ ‌ఓకు లేఖ రాశారు. ఈ అంశాన్ని వచ్చే వారం సైంటిఫిక్‌ జర్నల్‌ లో పరిశోధకులు ప్రచురించనున్నారు. WHO ఈ దిశగా పరిశోధన చెయ్యాలని కోరారు.