Begin typing your search above and press return to search.

సన్మానిస్తారంటే.. సస్పెన్షన్ ఏమిటీ జగన్ గారూ..

By:  Tupaki Desk   |   10 Feb 2020 4:29 AM GMT
సన్మానిస్తారంటే.. సస్పెన్షన్ ఏమిటీ జగన్ గారూ..
X
దేశ భద్రతకు ముప్పు కలిగించారని, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ అంశం రాజకీయ సెగలు పుట్టిస్తోంది. అతడి సస్పెన్స్ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే వెంకటేశ్వరావు సస్పెండ్ అంశంపై టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ను ఏబీ వెంకటేశ్వరరావు స్పందించి రీట్వీట్‌ చేశారు. ఇద్దరు తోడు దొంగలు తమ దొంగతనాన్ని బహిర్గతం చేసుకున్నట్టు ఉంది.

‘మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి.. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్‌ చేశారేంటి జగన్‌మోహన్‌రెడ్డి గారూ’ అని ఆదివారం ఎంపీ కేశినేని నాని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ చూసిన వెంటనే వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. ‘మీరూ, మీరూ పార్లమెంట్‌లో కలిసి మెలిసే ఉంటారుగా.. అందరూ కలిసి ఒక అభిప్రాయానికి రండి. నేను వృత్తి ధర్మం నిర్వర్తించానో లేక ఇంకేమైనా చేశానో.. నాక్కూడా ఒక క్లారిటీ వస్తుంది’ అని కామెంట్‌ చేశారు.

‘ఏమిటోనండీ ఎంపీ గారూ.. మీరేమో ఇలా అంటారు.. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబు గారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారు’ అని మరో ట్వీట్‌ చేశారు. ఈ విధంగా ఉన్న వారి ట్వీట్లను చూస్తుంటే అప్పట్లో పరస్పరం ఒకరినొకరు సహకరించుకున్నట్లు పరోక్షంగా తెలుస్తోంది.

1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఆ సమయంలో విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారని, ఇజ్రాయెల్ కు చెందిన ఓ సంస్థకు ఇంటెలిజెన్స్ అండ్ సర్వైవలెన్స్ కాంట్రాక్ట్ అప్పగింతలో అవతకవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యం లో అతడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.