Begin typing your search above and press return to search.
వైరల్: కరోనా ఇంత డేంజరా? డాక్టర్ చెప్పిన సంచలన విషయాలు
By: Tupaki Desk | 27 April 2021 1:00 PM GMTకరోనా రూపాంతరం చెందింది. ముఖ్యంగా ఈసారి యువతను టార్గెట్ చేసింది. 10లో 8మంది యువతే చనిపోతున్నారు. వ్యాక్సిన్లు వేసుకున్న వారు బతికి పోతున్నారు. ఎందుకిలా? ఇలాంటి సందేహాలపై ప్రముఖ డాక్టర్ చెప్పిన నిజాలు వైరల్ అయ్యాయి.
రాజమండ్రికి చెందిన ప్రముఖ డాక్టర్ ప్రదీప్ కరోనా సెకండ్ వేవ్ గురించి చెప్పిన విషయాలు వైరల్ అయ్యాయి. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత బాగా ఉందని.. ఏ మందులు వేసినా రోగుల్లో తగ్గడం లేదని ఆయన వాపోయారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ గురించి ఆయనచెప్పిన నిజాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో ఇప్పుడు అందరూ షేర్లు చేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
రెమెడిసెవిర్, స్టెరాయిడ్లు పనిచేయడం లేదని.. ఈసారి కరోనా రూపాంతరం చెందిందని.. అది మనిషిని కబళిస్తోందని డాక్టర్ ప్రదీప్ తెలిపారు. గతంలో కంటే బలమైన కరోనా వైరస్ లు ఇప్పుడుప్రజలకు ప్రమాదకరంగా మారాయని వివరించారు.
మొదటి వేవ్ లో 60ఏళ్లు పైబడిన వారు.. దీర్ఘకాలిక రోగులు చనిపోయారని.. కానీ ఈసారి 25-35 ఉన్న వారే ఎక్కువగా చనిపోతున్నారని డాక్టర్ ప్రదీప్ ఆందోళన వ్యక్తం చేశారు. యువత చాలా మంది చనిపోతున్నారని.. చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వివరించారు.
ఎవరికైతే వ్యాక్సిన్లు వేసుకున్నారో వారు సేఫ్ అవుతున్నారని.. ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోని 45 ఏళ్లలోపు వారే చనిపోతున్నారని డాక్టర్ ప్రదీప్ తెలిపాడు. ఇప్పుడు వ్యాక్సిన్లు వేసుకున్న వారు బతుకుతున్నారని.. వ్యాక్సిన్లు వేసుకోని 45 ఏళ్లలోపు వారే ఈసారి సెకండ్ వేవ్ లో ఎక్కువగా చనిపోతున్నారని తెలిపారు.
ఈసారి కరోనాతో మరణించే వారిలో యువత ఎక్కువగా ఉంటున్నారని.. వారికి వ్యాక్సిన్ వేయకపోవడమే ఈ మరణాలకు కారణం అని డాక్టర్ ప్రదీప్ తెలిపాడు.యువత నిర్లక్ష్యమే వారి ప్రాణాలు తీస్తోందని తెలిపారు.
నిర్లక్ష్యం వల్లే చాలా మంది చనిపోతున్నారని.. ఒకసారి జ్వరం వచ్చి తగ్గిపోతుంటే మాత్రలు వేసుకొని ఊరుకుంటున్నారని.. కానీ ఐదో రోజుతర్వాత అది ప్రమాదకరంగా మారుతుందని డాక్టర్ ప్రదీప్ తెలిపారు. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని.. మాస్కులు, శానిటైజర్లు వాడాలని.. బయట తిరగవద్దని.. కోవిడ్ నిబంధనలు పాటించి అందరూ ఇంట్లోనే ఉండి కరోనా సెకండ్ వేవ్ నుంచి రక్షించుకోవాలని డాక్టర్ ప్రదీప్ వివరించారు.
కరోనా గురించి డాక్టర్ ప్రదీప్ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వీడియో ఇదే..