Begin typing your search above and press return to search.
సైనికులు చస్తున్నా మోడీ ఎందుకీ మౌనం?
By: Tupaki Desk | 17 Jun 2020 6:00 AM GMTసరిహద్దుల్లో దాదాపు 20 మంది భారత సైనికులను చైనా చంపినా ప్రధాని నరేంద్రమోడీ నోట వెంట స్పందన లేదు. సైనికుల ప్రాణాలు పోతున్నా దృతరాష్ట్రుడిలా మౌనంగా ఉంటున్నాడన్న అపవాదును మూటగట్టుకుంటున్నాడు. చైనా డ్రాగన్ నిప్పులు కక్కుతున్నా చడీచప్పుడు లేదు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.? మన సైనికులను చంపుతున్నా.. మన భూమిని చైనా ఆక్రమిస్తున్నా ఎందుకు చోద్యం చూస్తున్నారని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
నెటిజన్లే కాదు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తాజాగా ఇదే ప్రశ్న వేశారు. ‘ఎందుకు మోడీ సైలెంట్ గా ఉంటున్నారు?.. ఎందుకు దాస్తున్నారు? అయిపోయేందేదో అయిపోయింది.. ఇప్పుడు ఏం చేయాలో చేయండి.. చెప్పండి.. మన సైనికులను చంపే ధైర్యానికి చైనా దిగింది. మన భూమిని లాక్కోంటోంది?’ మౌనం వీడండి అంటూ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాని అసహాయతను ఎత్తి చూపారు.
నిజానికి చైనా చాలా విషయంలో ప్రపంచం మీద ఆధారపడి బతుకుతోంది. భారీ జనాభా ఉన్న భారత్ వంటి దేశాల్లో తను తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకుంటోంది. చైనాకు భారత్ అతిపెద్ద మార్కెట్. మన మీద బతుకుతున్న చైనా మన సైనికులను చంపడం.. మన భూములు ఆక్రమించడం చూశాక ప్రతీ భారతీయుడి గుండె రగిలిపోతోంది. చైనాకు బుద్ది చెప్పాలన్న కసి పెరుగుతోంది.
ఇన్నాళ్లు చైనా తీరుకు నిరసనగా ఆదేశ వస్తువులు, యాప్ లను బ్యాన్ చేయాలని భారతీయులు యుద్ధం చేశారు. ఇప్పుడు 20 మంది సైనికులను చంపిన చైనా తీరుతో మరింత రగిలిపోతున్నారు. చైనాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతటి దురాగతానికి పాల్పడిన చైనా విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మాత్రం సైలెంట్ గా ఉండడం విమర్శలకు తావిస్తోంది. చైనాపై మోడీ ఎదైనా గట్టి నిర్ణయం తీసుకోవాలని.. బుద్ది చెప్పాలని దేశ ప్రజానీకం అంతా కోరుతోంది. మరి ఇప్పటికైనా మోడీ మౌనం వీడుతాడా అన్నది వేచిచూడాలి.