Begin typing your search above and press return to search.

ఓర్నీ.. ఒమిక్రాన్ ఇంత డేజంరా? కొత్త విషయాలు వెలుగులోకి!

By:  Tupaki Desk   |   27 Jan 2022 4:30 AM GMT
ఓర్నీ.. ఒమిక్రాన్ ఇంత డేజంరా? కొత్త విషయాలు వెలుగులోకి!
X
మాయదారి కరోనా ఒకటి.. రెండు వేవ్ లతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచం.. మూడో వేవ్ ను ఒమిక్రాన్ రూపంలో తీసుకొచ్చింది. చూస్తుండగానే ప్రపంచంలోనే దాదాపు అన్ని దేశాలకు అంటిన ఈ మాయదారి వేరియంట్ కు సంబంధించి తాజాగా ఒక కొత్త అధ్యయన రిపోర్టు వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇంత వేగంగా ఒమిక్రాన్ ఎలా వ్యాపిస్తోంది? దానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు ఒక్కొక్కరు ఒక్కోలాంటి సమాధానం చెప్పేస్తుంటారు. అయితే.. దీనికి సంబంధించి తాజాగా ఒక అధ్యయనం షాకింగ్ నిజాల్ని వెల్లడించింది.

జపాన్ కు చెందిన క్యోటో ప్రిఫెక్చురల్ వర్సిటీ పరిశోధకులు ఒమిక్రాన్ మీద పెద్ద ఎత్తున రీసెర్చ్ చేశారు. ప్రపంచానికి సవాలు విసిరిన ఈ వేరియంట్ ప్రత్యేకత ఏమంటే.. మనిషి శరీరంపై 21 గంటల పాటు ఒమిక్రాన్ ఉంటుందని సదరు అధ్యయనం స్పష్టం చేసిన వైనం షాకింగ్ గా మారింది. అంతేకాదు..ఈ వేరియంట్ ప్లాస్టిక్ మీద ఎనిమిది రోజుల పాటు సజీవంగా ఉంటుందని గుర్తించారు. ఇప్పటివరకు వెలుగు చూసిన కరోనా అన్ని వేరియంట్లలలో ఒమిక్రాన్ ప్రమాదకరమైనదిగా పేర్కొన్నారు.

ప్రపంచం ఇప్పుడున్న పరిస్థితులకు రావడానికి చైనాలోని వూహాన్ లో ఉద్భవించిన సార్క్ సీఓవీ2 మొదలు పెడితే.. ఆ తర్వాత ఈ వేరియంట్ నుంచి అల్ఫా.. బీటా.. డెల్టా.. ఒమిక్రాన్ ఇలా ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు బయటకు వచ్చాయి. అయితే.. వీటిల్లో వేటికి లేని రీతిలో ఒమిక్రాన్ మనిషి చర్మం మీదా.. ప్లాస్టిక్ మీద రెండు రెట్లు అధికంగా జీవిస్తుందని వైద్యులు గుర్తించిన వైనం బయటకు వచ్చింది.

మొదట్నించి పుట్టిన వేరియంట్ దగ్గర నుంచి ఓమిక్రాన్ వరకు చూస్తే.. ప్లాస్టిక సర్ఫేస్ మీద వుహాన్ ఒరియంట్ 56 గంటలు.. ఆల్పా వేరియంట్ 191.3 గంటలు.. బీటా 191.1 గంటలు.. డెల్టా 16.8 గంటలు.. ఒమిక్రాన్ 193.5 గంటల పాటు సజీవంగా ఉంటుందని గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ మీద ఇన్నేసి గంటలు ఉండే ఒమిక్రాన్ వేరియంట్.

మనిషి చర్మం మీద మాత్రం.. వూహాన్ వేరియంట్ 8.6 గంటలు.. ఆల్పా వేరియంట్ 19.6 గంటలు.. బీటా 19.1 గంటలు.. డెల్టా 16.8 గంటలు ఉంటే.. ఒమిక్రాన్ మాత్రం ఏకంగా 21.1 గంటలు ఉంటుందని తాము గుర్తించినట్లుగా చెబుతున్నారు. సో.. ఒమిక్రాన్ అంత వేగంగా ఎలా వ్యాపిస్తుందో ఈ అధ్యయన వివరాల్ని చూస్తే.. కరోనా వ్యాప్తి విషయంలో ప్రజల్లో ఉన్న గందరగోళంతో పాటు.. కొత్త విషయాలు తెలుసుకోవటానికి విషయం ఇంచుమించు అర్థమైందని చెప్పక తప్పదు. సో.. బీకేఆర్ ఫుల్.