Begin typing your search above and press return to search.

ఆ జైలులో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్.. ఎలా వచ్చింది?

By:  Tupaki Desk   |   19 Nov 2022 2:30 AM GMT
ఆ జైలులో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్.. ఎలా వచ్చింది?
X
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ జైలులో ఎయిడ్స్ కలకలం రేపుతోంది. ఒకరి కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 140 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకడం సంచలనమైంది. ఘజియాబాద్‌లోని దాస్నా జిల్లా జైలులో మొత్తం 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు జైలు సీనియర్ అధికారి శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. జైలులో ఉంచే ముందు ఖైదీలందరికీ హెచ్‌ఐవి పరీక్షలు చేస్తారు.

ఘజియాబాద్ జైలులోని ఖైదీలను ఎంఎంజీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న యాంటీరెట్రోవైరల్ థెరపీ సెంటర్ వైద్యులు తనిఖీ చేస్తారని, జిల్లా జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ తెలిపారు.

2016లో స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జైళ్లలో హెచ్ఐవీ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించింది. ఆ సమయంలో ఘజియాబాద్ జైలులో 49 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ సోకినట్లు తేలింది. ఆ తర్వాత, ప్రభుత్వం సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా హెచ్ఐవీ మరియు టీబీ పరీక్షలను కొత్త ఖైదీలందరికీ తప్పనిసరి చేసింది.

ఖైదీకి హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, జైలు లోపల ఉన్న ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్ (ICTC)లో అతనికి ఏఆర్వీ చికిత్స అందించబడుతుంది.

ప్రస్తుతం ఘజియాబాద్ జైలులో దాదాపు 5,500 మంది ఖైదీలు ఉన్నారు. “5,500 మంది ఖైదీలలో 140 మంది హెచ్‌ఐవి పాజిటివ్‌గా సోకింది. వారిలో 35 మందికి టిబి కూడా ఉంది. 2016 నుంచి సగటున 120 నుంచి 150 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ ఖైదీలు జైలులో నివసిస్తున్నారని సింగ్ చెప్పారు.

అయితే వీరికి శృంగారం ద్వారా ఎయిడ్స్ సోకిందా? అసహ జ శృంగారానికి వీరు పాల్పడ్డారా? లేక ఇంజక్షన్ ఒకరికి ఇచ్చింది మరొకరికి ఇచ్చి ఇంతమందికి సోకేలా చేశారా? అన్న దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. జైలులో ఖైదీలు బయట నుంచి వ్యభిచారుణులను తెప్పించుకొని ఇలా ఎయిడ్స్ తెచ్చుకున్నారా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.