Begin typing your search above and press return to search.
ఆఫ్రికన్ బానిసలతో అమెరికా ఎలా మారింది?
By: Tupaki Desk | 26 July 2020 1:30 AM GMTఆఫ్రికా ఖండానికి చెందిన మూలాలున్న బరాక్ ఒబామా అమెరికాకు అధ్యక్షుడయ్యాడు. నిజానికి అమెరికాలో ఇతర ఖండాల వారి ఆధిపత్యం చాలా ఉంది. దీనికి కారణం అమెరికాకు బ్రిటీష్, యూరప్ వలసలతో పాటు ఆఫ్రికా ఖండం నుంచి వలసలు పెద్ద ఎత్తున వచ్చారు. అమెరికా ఖండంలోని వివిధ ప్రాంతాలకు కోటిమందికి పైగా ఆఫిక్రన్లను నాడు స్వాంతంత్రానికి పూర్వం బానిసలుగా తీసుకురావడంతో ఇప్పుడు ప్రస్తుత జనాభా జన్యు సమూహంపై తీవ్ర ప్రభావం చూపిందని ఓ అధ్యయనం తేల్చింది.
1515-19వ శతాబ్ధం మధ్య వరకు అమెరికా ఖండానికి పెద్ద ఎత్తున బానిసల వర్తకం జరిగింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా 1.25 కోట్ల మందికి పైగా ఆఫ్రికన్లను అమెరికా ఖండాల్లోని వివిధ ప్రాంతాలకు బానిసలుగా తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఆఫ్రికన్ వాసులను తీసుకువస్తుండగా దాదాపు 20 లక్షల మంది వచ్చే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ఇలా వచ్చిన ఆఫ్రికన్ బానిసలు అనంతరం క్రమంలో అమెరికా ఖండాల్లో జనాభాపై తీవ్ర ప్రభావం చూపారు. జన్యుపరంగా చూపించిన ప్రభావంపై ‘23అండ్ మీ’ అనే సంస్థ అధ్యయనం చేయగా.. అమెరికన్ జర్నల్ ఆఫ్ హ్యుమన్ జెనెటిక్స్ లో ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతం ఈ ఆఫ్రికన్ మూలాలున్న అమెరికన్ల జనాభా అంగోలా, కాంగో దేశాల్లో మెజార్టీ స్థాయిలో ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. బానిసల వర్తకానికి ప్రధానంగా ఉపయోగించిన మార్గం కూడా ఈ దేశాల గుండే కావడంతో ఆ దేశాల్లో ఆఫ్రికన్లు నిండిపోయారని తెలుస్తోంది. అక్కడి జనాభాతో సంపర్కం చెంది.. అక్కడి వారిని పెళ్లి చేసుకొని మిక్స్ అయిపోయారు.
ఇందులో ఎక్కువగా నైజీరియన్ మూలాలున్న వాళ్లు అమెరికాలో.. లాటిన్ అమెరికా దేశాల్లో ఎక్కువగా ఉన్నారని సర్వేలో తేలింది. 1619-1807 మధ్య బానిసల వర్తకం వల్ల నైజీరియన్స్ అమెరికా, లాటిన్ అమెరికాల్లో సెటిల్ అయి ఇప్పుడు ప్రబలంగా జనాభాలో తయారయ్యారని తేలింది. అట్లాంటిక్ సముద్రం మీదుగా బ్రిటీష్ కరీబియన్ ప్రాంతం నుంచి బానిసలుగా ఉన్న నైజీరియన్లను మిగతా ప్రాంతాలకు తరలించి ఉంటారని భావిస్తున్నారు. సెనెగల్, గాంబియా లాంటి ప్రాంతాల మూలాలు కలిగిన వాళ్లు మాత్రం అమెరికా ఖండాల్లో తక్కువగా కనిపించారు.
ఇక ఆఫ్రికన్లను వరిచేనుల్లో పనికి పెట్టారు. వారు మలేరియా సహా ప్రమాదకర పరిస్థితుల వల్ల చనిపోవడంతో అమెరికన్ ఖండాల్లో పనిచేసే బానిసల జనాభా తగ్గిపోయింది. దీంతో బానిస మహిళలపై లైంగిక దాడులు చేసి వారితో బిడ్డలను కని ఆ మహిళలను బానిసల నుంచి విముక్తి చేశారు. బానిసలుగా ఉన్న ఆఫ్రికన్ మహిళలపై వాళ్ల యజమానులు.. ఇతరులు చేసిన లైంగిక దోపిడీ వల్ల అమెరికాలో కల్చర్ మిక్స్ అయిపోయిందని తేలింది. అమెరికన్స్, ఆఫ్రికన్స్ జీన్స్ కలిసిపోయి కొత్త ఆప్రో అమెరికన్స్ అవతరించారు.
లాటిన్ అమెరికాలో జన్యుసమూహంలో ప్రతీ ఆఫ్రికన్ పురుషుడి భాగస్వామ్యానికి 17మంది ఆఫ్రికన్ మహిళల భాగస్వామ్యం ఉందని పరిశోధకులు గుర్తించారు.
అయితే బ్రిటీషర్లు వలస పాలనలో ఉన్న అమెరికాలో మాత్రం ప్రతీ ఆఫ్రికన్ పురుషుడికి ఇద్దరు ఆఫ్రికన్ మహిళల భాగస్వామ్యం ఉందని తేలింది.
అమెరికా ఇప్పుడున్న అమెరికాలో ఆఫ్రికన్ మహిళలపై అక్కడి అమెరికన్స్ లైంగిక దోపిడీ తక్కువగా ఉండగా.. లాటిన్ అమెరికాలో సగటున 17మంది లైంగిక దోపిడీ చేశారు.
ఇలా ఆఫ్రికన్ అమెరికన్లపై ... ఆఫ్రికన్ మూలాలున్న వారిపై వలసవాదం.. బానిసత్వం చూపిన దుష్ప్రభావాలు ఇప్పుడు అమెరికన్ జనాభాలో వారి సంతతి పెరగడానికి కారణమైంది.