Begin typing your search above and press return to search.

అప్ఘన్ లోని విలువైన బంగారం అమెరికా ఎలా చేరింది?

By:  Tupaki Desk   |   21 Aug 2021 9:40 AM GMT
అప్ఘన్ లోని విలువైన బంగారం అమెరికా ఎలా చేరింది?
X
మరో 90 రోజుల్లో తాలిబన్లు అప్ఘనిస్తాన్ ను ఆక్రమిస్తారని అమెరికన్ కు చెందిన సీఐఏ వర్గం ఈనెల 11న ప్రకటించింది. కాని ఊహించని విధంగా వారం రోజుల్లోనే కాబుల్ ను ఆక్రమించేశారు. ఇలా అక్రమించుకోవడాన్ని నమ్మలేకపోతున్నామని అమెరికాకు చెందిన ఉన్నతాధికారి మార్క్ మిలే అన్నారు. అయితే కాబుల్ ను ఇంత స్పీడుగా అక్రమిస్తారని అమెరికాకు ముందే తెలుసా..? భారత్ కూడా తాలిబన్లు అప్ఘనిస్తాన్ ను ఆక్రమిస్తారని జనవరిలోనే గ్రహించిందా..? ఇదిలా ఉండగా అప్ఘనిస్తాన్ ను ఆక్రమించిన తాలిబన్లు ఓ విషయంలో షాక్ తింటున్నారట. తాము అనుకున్నది ఒకటి.. జరిగించి మరొకటని ఫీలవుతున్నారట. ఇలా వారు షాక్ తినడానికి అమెరికా, ఇండియా వేసిన ప్లాన్ లో భాగమేనా..? అంటే ఇప్పుడు తాలిబన్లు అప్ఘనిస్తాన్ ను పాలించాలంటే అమెరికా, ఇండియా అవసరం కచ్చితంగా అవసరం ఉందా..?

ఈనెల 15న తాలిబన్లు కాబుల్ లో జాతీయ జెండాను దించేసి తమ జెండాను ఆక్రమించారు. అంతకుముందు నెల రోజుల నుంచే తీర ప్రాంతాలను ఆక్రమిస్తున్న వారు అమెరికా ప్రకటన చేసిన వారం రోజులకే దేశం మొత్తం ఆక్రమించేశారు. తాలిబన్లు ఆక్రమించుకోవడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొందరు దేశం విడిచి వెళ్లారు. మరికొందరు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు అప్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవడానికి అమెరికానే కారణమని ఆ దేశ ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచంలో అగ్రగామిగా చెప్పుకుంటున్న అమెరికా సాధారణ ప్రజలకు అన్యాయం చేసిందంటున్నారు.

తాలిబన్లు అప్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవడంపై పాకిస్థాన్, చైనా వెంటనే మద్దతు ప్రకటించాయి. సోవియట్ యూనియన్ పరోక్షంగా మద్దతు ప్రకటిస్తోంది. అయితే అమెరికా, భారత్ లాంటి దేశాలు ఏవిదంగానే స్పందించడం లేదు. ఇప్పటికే అమెరికా తన సైనిక బలగాలను వెనక్కి రప్పించేసింది. భారత్ కూడా దౌత్య కార్యాలయ సిబ్బందితో సహా 200కు పైగా సిబ్బందిని వెనక్కి తీసుకురాగలిగింది. అయితే మరికొంత మంది చిక్కుకున్నారని, వారిని కూడా రప్పిస్తామని ప్రకటిస్తోంది. మరోవైపు ఈ వీసాను అమలు చేసి భారత్ కు వచ్చే వారికి అవకాశం కల్పిస్తానని చెబుతోంది.

కాబుల్ ను ఆక్రమించిన తాలిబన్లు మొదటగా సెంట్రల్ బ్యాంకు వైపు వెళ్లారు. ఎందుకంటే దేశ సంపద మొత్తం ఇందులో ఉంటుంది. ఇలా బ్యాంకుకు వెళ్లిన తాలిబన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే తాలిబన్లు ఊహించిన డబ్బు, బంగారం సెంట్రల్ బ్యాంకులో లేవు. అంటే తాలిబన్లు పరిపాలన చేయడానికి అవసరమైన డబ్బు లేదు. అయితే ఆ డబ్బు ఏమైంది..? బంగారమంతా ఎక్కడికి వెళ్లింది..? అనే ఆసక్తి విషయం బయటకొచ్చింది.

అయితే కొన్ని పరిణామాల దృష్ట్యా ఓ విషయం ష్పష్టమవుతోంది. అప్ఘనిస్తాన్ కు చెందిన 22వేల కిలోల బంగారం అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు 9. 5 బిలియన్ డబ్బు కూడా అమెరికాకు తరలించినట్లు అప్ఘాన్ బ్యాంకుకు చెందిన అధికారి అజ్మల్ అహ్మద్ అంటున్నారు. అయితే అమెరికా, భారత్ లు కలిసి ఈ డబ్బును తాలిబన్లకు చేరకూడదనే ఉద్దేశంలో ప్రీప్లాన్ చేశారని చర్చ సాగుతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఈ ఏడాది జనవరి 8 న జరిగిన యునేటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించింది. ఈ కమిటీని తాలిబన్ సాంక్షన్ కమిటీగా ఏర్పాటు చేశారు. అంటూ తాలిబన్లకు స్వేచ్ఛ నివ్వడానికి ఏర్పాటు చేసిన కమిటీగా చెప్పుకుంటారు. ఇదిలా ఉండగా ఇదే ఏడాది జూలైలో విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ న్యూయార్క్ ను సందర్శించాడు. అయితే హర్షవర్దన్ అప్ఘాన్ గోల్డ్ కోసమే వెళ్లినట్లు సమాచారం. ఇక్కడ జరిగిన చర్చలో అప్ఘాన్ కు చెందిన డబ్బు న్యూయార్క్ లో ఎంత ఉంది..? ఒకవేళ తాలిబన్లు అప్ఘనిస్తాన్ ను ఆక్రమిస్తే ఎంత డబ్బు వారికుంచాలి..? అనే విషయాలను చర్చించారు. ఇందులో భాగంగా అప్ఘాన్లో 160 మిలియన్లను మాత్రమే వదిలిపెట్టి వచ్చినట్లు తెలుస్తోంది. పాలనకోసం ఈ డబ్బు మాత్రమే ఉండడంతో తాలిబన్ల దిమ్మ దిరిగిపోయింది. ఈ వ్యవహారాలను చూస్తే తాలిబన్లు అప్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవడాన్ని ముందే గ్రహించారు.

అయితే ఇప్పుడు తాలిబన్లు దేశాన్ని పాలించాలంటే సరైన డబ్బు కావాలి. ఒకవేళ వారి డబ్బు అమెరికాలో ఉందని తెలుసుకున్న కమిటీ సాంక్షాన్ చేయాలి. అంటే ఆ కమిటీ అధ్యక్షత వహించిన ఇండియా వద్దకే రావాలి. ఇలా భారత్, అమెరికా ఆడిన గేమ్ లో తాలిబన్లు ఇరుక్కుపోయారని అంటున్నారు.