Begin typing your search above and press return to search.
4.7 లక్షల పెండింగ్ వీసాలపై బైడెన్ నిర్ణయమేంటి? హెచ్1బీపై సర్వత్రా ఉత్కంఠ!
By: Tupaki Desk | 2 March 2021 10:33 AM GMTనాన్ మైగ్రెంట్ వీసా సహా హెచ్1బీ వీసాలపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వం దృష్టి సారించింది. దాదాపు 4,70,000 వలస దారుల వీసాలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. అదేసమయంలో విదేశీ నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1బీ వీసాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? అనేది హాట్ టాపిక్ గా హల్‌చల్ చేస్తోంది. ఈ హెచ్1బీ వీసాల విషయంలో గత అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిషేధం(మార్చి 31 వరకు అమల్లో ఉంది) ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఎత్తేస్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
ఈ విషయంపై హోంల్యాండ్ సెక్యూరిటీ అలెజాండ్రో మేఆర్కాస్ స్పందిస్తూ.. హెచ్ 1బీ వీసాలపై విధించిన నిషేధం విషయాన్ని పదేపదే ప్రశ్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తన వద్ద సరైన సమాచారం లేదని చెప్పారు. ఈ మేరకు సోమవారం.. ఆయన వైట్ హౌస్ వద్ద జరిగిన మీడియా బ్రీఫింగ్‌లో మాట్లాడారు. సమాజంలో హింసను దూరం చేయడమే ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన పనిగా పేర్కొన్నారు.
అమెరికాలో ఉపాధి,ఉద్యోగాలు.. కరోనా మహమ్మారి విలయం సమయంలో తీవ్రంగా ప్రభావితమయ్యాయ ని మే ఆర్కాస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత ట్రంప్ ప్రభుత్వం.. పర్మినెంట్ రెసిడెన్సీగా భావించే ఇమ్మిగ్రేషన్ వీసా, హెచ్ 1 వీసాలపై నిధేషం విధించింది. అదేసమయంలో తాత్కాలిక వర్క్ వీసాలను కూడా నిషేధించింది. వీటిలో హెచ్ 1బీ, హెచ్ 4, హెచ్ 2బీ, ఎల్ 1, జే కేటగిరీలు ఉన్నాయి.
గత నెల 24న బైడెన్ ప్రభుత్వం .. ఓప్రకటన విడుదల చేసింది గత ట్రంప్ సర్కారు విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. మైగ్రేషన్ వీసాపై అమెరికాలో అడుగు పెట్టిన వారు ఇబ్బందులు పడరాదని పేర్కొంది. అయితే.. హెచ్ 1బీ, జే 1, ఎల్1 వీసాలపై మాత్రం నిషేధం ఎత్తేస్తారా? లేక.. ఏం చేస్తారు? అనే విషయంపై స్పష్టత రాకపోవడం గమనార్హం. మరో వైపు ట్రంప్ విధించిన నిషేధం ఈ నెల 31 వరకు కొనసాగనుంది. తాజాగా బైడెన్ ప్రభుత్వం వెల్లడించిన దానిని బట్టి.. వలసేతర వ్యక్తుల వీసా కేసులను సత్వరమే పరిష్కరించాలనే ప్రాధాన్యం లేదని వివరించింది.
``ఇమ్మిగ్రేషన్ వీసాలను ప్రాధాన్యం ప్రకారం ప్రాసెస్ చేస్తాం`` అని వీసా సేవల కౌన్సిలర్ వ్యవహారాల సహాయ డిప్యూటీ సెక్రటరీ జులీ స్టఫ్ట్ పేర్కొన్నారు. ముఖ్యంగా దంపతులు, చిన్నారులకు ఇచ్చే వీసాల ను కూడా ప్రాధాన్యతా క్రమంలో ఇస్తామని తెలిపారు. అయితే.. చైనా, బ్రెజిల్,ఇరాన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, సహ 26 దేశాలపై ఉన్న నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే.. చట్ట ప్రకారం అమెరికాలో శాస్వత నివాసం ఉండేవారికి ఇది వర్తించదని తెలిపారు.
ప్రస్తుత సమయంలో అమెరికాలోని 136 ఇమ్మగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ 90 శాతం పైగా జరుగుతున్నట్టు చెప్పారు. మిగిలిన వాటిని ఎమర్జెన్సీ సర్వీసుల ద్వారా డెలివరీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. సాధారణ నాన్ ఇమ్మిగ్రెంట్స్‌కు సంబంధించి మొత్తం 233లో కేవలం 43 నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ పోస్ట్స్ జరుగుతున్నాయని తెలిపారు. మిగిలిన వాటిని ఎమర్జన్సీ సేవల కింద చేస్తున్నామని తెలిపారు.